National

చంద్రుడు చేతికి చిక్కాడు. తర్వాత సూర్యుడే.. “ఇస్రో మిషన్” ఇంపాజిబుల్!

యావత్ భారత దేశ ప్రజల ఆశలను, ఆకాంక్షలను నిజం చేస్తూ చంద్రయాన్‌-3 విజయవంతమైంది. పట్టువదలని విక్రమ్‌ ల్యాండర్‌ జాబిల్లి నేలను ముద్దాడింది.

దేశ అంతరిక్ష పరిశోధనల రంగంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. మరి నెక్స్ట్‌ ఏంటి? ఇస్రో చేపట్టబోతున్న తదుపరి ప్రాజెక్టులేంటి? అంటే.. ఉన్నాయ్‌, చాలా ఉన్నాయ్‌. ఈ ప్రాజెక్టులతో ఇస్రో చాలా బిజీగా ఉండబోతోంది.

ఆదిత్య ఎల్‌1

చందమామపై అడుగు పెట్టిన ఇస్రో తదుపరి లక్ష్యం సూర్యుడే. ఈ మిషన్‌లో భాగంగా మన శాస్త్రజ్ఞులు పీఎస్ ఎల్వీ సీ56 రాకెట్‌ ద్వారా ఆదిత్య ఎల్‌1 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనున్నారు. 1412 కిలోల బరువుండే ఈ ఉపగ్రహం.. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి ఎల్‌1 పాయింట్‌ (సూర్యుడికి-భూమికి నడుమ ఉండే పాయింట్‌ ఇది. దీన్ని లాగ్రాంజ్‌ పాయింట్‌ 1 అంటారు) వద్ద కక్ష్యలోకి చేరుకుని సౌరతుఫాన్ల సమయంలో సౌర వాతావరణం ఎలా ఉంటుందో అధ్యయనం చేయనుంది. ఈ ప్రాజెక్టు ఖర్చు దాదాపు రూ.378 కోట్లు.

నిసార్‌

ఇస్రో, నాసా కలిసి సంయుక్తంగా చేపడుతున్న దిగువ భూకక్ష్య అబ్జర్వేటరీ మిషన్‌ ఇది. నిసార్‌ అంటే.. నాసా-ఇస్రో సింథటిక్‌ అపెర్చర్‌ రాడార్‌. ఇది భూమి చుట్టూ తిరుగుతూ ప్రతి 12 రోజులకొకసారి భూమిని మ్యాప్‌ చేస్తుంది. 2024 జనవరిలో చేపట్టబోయే ఈ ప్రాజెక్టు విలువ దాదాపు రూ.12,379 కోట్లు. భూ పర్యావరణ వ్యవస్థలో మార్పులు, సముద్ర మట్టాల పెరుగుదల, భూగర్భజలాల స్థితిగతులు, భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత పేలుళ్ల వంటి ముప్పుల గురించి తెలుసుకోవడానికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడనుంది.

స్పేడెక్స్‌

స్పేడెక్స్‌ అంటే.. స్పేస్‌ డాకింగ్‌ ఎక్స్‌పరిమెంట్‌. రెండు వ్యోమనౌకలను ఒకదానితో మరొకటి కలపడం, ఫార్మేషన్‌ ఫ్లయింగ్‌ వంటివి దీని లక్ష్యాలు. 2024 మూడో త్రైమాసికంలో రూ.124.47 కోట్ల వ్యయంతో దీన్ని చేపట్టనున్నారు.

మంగళ్‌యాన్‌ 2

మంగళ్‌యాన్‌ 1 ద్వారా ఇప్పటికే కుజుడి కక్ష్యలో మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌ (మామ్‌)ను ప్రవేశపెట్టిన ఇస్రో.. వచ్చే ఏడాది మంగళ్‌యాన్‌-2 ప్రాజెక్టు చేపట్టి మామ్‌-2ను కుజుడి కక్ష్యలోకి పంపేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

గగన్‌యాన్‌ 1, 2, 3

భారతదేశం చేపట్టబోయే తొలి మానవ స్పేస్‌ మిషన్‌ గగన్‌యాన్‌. భూమికి 400 కిలోమీటర్ల కక్ష్యలోకి ముగ్గురు వ్యోమగాములను పంపి, 3 రోజుల తర్వాత వారిని సురక్షితంగా భూమికి తీసుకురావడం దీని లక్ష్యం. అయితే, తొలి రెండు గగన్‌యాన్‌లూ (జీ1, జీ2) మానవరహిత మిషన్లు. మూడోది హెచ్‌1 మిషన్‌. అంటే హ్యూమన్‌1 మిషన్‌. ఈ ప్రాజెక్టు విలువ రూ.9,023 కోట్లు.

శుక్రయాన్‌ 1

కుజుడి కక్ష్యలో ఆర్బిటర్‌ (మామ్‌)ను ప్రవేశపెట్టినట్టే.. శుక్రగ్రహ కక్ష్యలోకీ ఒక ఆర్బిటర్‌ను పంపి ఆ గ్రహంపై పరిశోధనలు చేసే లక్ష్యంతో ఇస్రో శుక్రయాన్‌-1 ప్రాజెక్టుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ ప్రాజెక్టుకు రూ.500 నుంచి 1000 కోట్ల దాకా ఖర్చవుతుందని అంచనా. 2024 చివర్లో ఈ ప్రాజెక్టును చేపట్టే అవకాశం ఉంది. ఒకవేళ అప్పటికి చేయలేకపోతే.. 2026 లేదా 2028లో చేపట్టే అవకాశం ఉంది. అయితే.. 2031లో చేపడితే ఈప్రాజెక్టు విజయవంతం అయ్యే అవకాశాలు ఉన్నాయని కొందరు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ..వీటితోపాటు, భారతదేశపు తొలి, డెడికేటెడ్‌ పోలారిమెట్రీ మిషన్‌ ‘ఎక్స్‌పోశాట్‌ (ఎక్స్‌-రే పోలారిమీటర్‌ శాటిలైట్‌)’ ప్రయోగానికి కూడా ఇస్రో సిద్ధంగా ఉంది. రోదసి నుంచి వచ్చే ఎక్స్‌ కిరణాల మూలాలను కనిపెట్టే ప్రాజెక్టు ఇది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com

23

2

1

+26
#Hashtags
#Politics
#Chandrayaan 3
#ISRO PSLV C52 Satellite Launch
#ISRO Launches PSLV
#Chandrayaan 2023
Comments

ఆచార్యులు.3hr
ఏది ఏమైనా ఖగోళయానం మనదేశానికికలిగిన మంచి వ్యసనం .

0

ఇళ్ల గుట్టు లాగి.. చోరీలకు పాల్పడ్డ వాలంటీర్‌!
ఇళ్ల గుట్టు లాగి.. చోరీలకు పాల్పడ్డ వాలంటీర్‌!
3hr116 shares
పోలీసులకు బాధితుల ఫిర్యాదు

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: పేదలకు సంక్షేమ పథకాలు అందించాల్సిన ఓ మహిళా వాలంటీరు పథకం ప్రకారం చోరీలకు పాల్పడింది. బాధితులు గురువారం పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదుచేయడంతో విషయం వెలుగు చూసింది.

ఇంకా చదవండి

TV9 తెలుగు
Brics Summit 2023: బ్రిక్స్‌ కూటమి విస్తరణ.. కొత్తగా ఆరుదేశాలకు చోటు.. కొత్త శక్తి వచ్చిందన్న ప్రధాని మోడీ
Brics Summit 2023: బ్రిక్స్‌ కూటమి విస్తరణ.. కొత్తగా ఆరుదేశాలకు చోటు.. కొత్త శక్తి వచ్చిందన్న ప్రధాని మోడీ
3hr33 shares
బ్రిక్స్ కూటమి దేశాధినేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. బ్రిక్స్ కూటమిలో మరో ఆరు కొత్త సభ్య దేశాలను చేర్చుకోవాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో అర్జెంటీనా, ఈజిప్ట్​, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్​కు బ్రిక్స్ కూటమిలో చోటు దక్కనుంది.

ఇంకా చదవండి

NTV Telugu
69th National Film Awards: జాతీయ సినిమా అవార్డులు.. అల్లు అర్జున్‌ సహా ఎవ్వరినీ వదలని పవన్‌..
69th National Film Awards: జాతీయ సినిమా అవార్డులు.. అల్లు అర్జున్‌ సహా ఎవ్వరినీ వదలని పవన్‌..
14hr28 shares
69th National Film Awards: 69వ జాతీయ సినిమా అవార్డుల్లో టాలీవుడ్‌ సినిమాలు దుమ్మురేపాయి.. వివిధ విభాగాల్లో ఏకంగా 10 అవార్డులను సొతం చేసుకున్నాయి..

ఇంకా చదవండి

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అరెస్ట్‌
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అరెస్ట్‌
2hr916 shares
అట్లాంటా: అమెరికా (USA) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) అరెస్టు అయ్యారు. 2020 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఫలితాల్లో జోక్యం, కుట్ర తదితర కేసులు ఆయనపై నమోదైన నేపథ్యంలో పోలీసులకు లొంగిపోవాల్సి ఉంది.

ఇంకా చదవండి

NTV Telugu
Gold Today Price: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు! మరోసారి 60 వేలకు చేరువలో
Gold Today Price: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు! మరోసారి 60 వేలకు చేరువలో
3hr11 shares

Gold Price Today in Hyderabad 25th August 2023: బంగారం ధరలు మళ్లీ ఆకాశాన్నంటున్నాయి. వరుసగా మూడు రోజులు పెరిగిన పసిడి ధరలు నేడు కూడా అదే బాటలో నడిచాయి.

ఇంకా చదవండి

69th National Awards: 2022లో విడుదలైన సినిమాలకు 2021 అవార్డులా.. అదెలా?
69th National Awards: 2022లో విడుదలైన సినిమాలకు 2021 అవార్డులా.. అదెలా?
2hr16 shares
2021 సంవత్సరానికిగాను జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తొలిసారి తెలుగు సినిమాలు దుమ్ము రేపాయి. తెలుగు సినిమా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా ఏంటో మరోసారి చూపించింది.

ఇంకా చదవండి

TV9 తెలుగు
Afghanistan vs Pakistan: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ సారథి.. బద్దలైన విరాట్, ధావన్ రికార్డులు..
Afghanistan vs Pakistan: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ సారథి.. బద్దలైన విరాట్, ధావన్ రికార్డులు..
2hr7 shares
Babar Azam Record: వన్డే క్రికెట్‌లో మొదటి 100 ఇన్నింగ్స్‌లలో 5000 పరుగులు పూర్తి చేసిన ప్రపంచంలోనే మొదటి బ్యాట్స్‌మెన్‌గా బాబర్ ఆజం నిలిచాడు.
ఇంకా చదవండి

Mera Bill Mera Adhikar: రశీదు అడగండి.. అప్‌లోడ్‌ చేయండి.. రూ.కోటి బహుమతి పొందండి
Mera Bill Mera Adhikar: రశీదు అడగండి.. అప్‌లోడ్‌ చేయండి.. రూ.కోటి బహుమతి పొందండి
37m66 shares
నెలవారీ ప్రైజ్‌మనీలు కూడా’మేరా బిల్‌ మేరా అధికార్‌’ను ప్రారంభించనున్న ప్రభుత్వం
వినియోగదార్లలో రశీదు అడిగే సంస్కృతిని ప్రోత్సహించేందుకే

ఇంకా చదవండి

తొలి వన్డేలో 59 పరుగులకే చిత్తు.. రెండో వన్డేలో 227/0.. ఆఫ్ఘన్‌ ఓపెనర్ల రికార్డు
తొలి వన్డేలో 59 పరుగులకే చిత్తు.. రెండో వన్డేలో 227/0.. ఆఫ్ఘన్‌ ఓపెనర్ల రికార్డు
16hr45 shares
ఆఫ్ఘనిస్తాన్‌ జట్టులో కేవలం గంటల వ్యవధిలో భారీ మార్పు వచ్చింది. మొన్న (ఆగస్ట్‌ 24) హంబన్‌తోటలో పాకిస్తాన్‌తో జరిగిన తొలి వన్డేలో 59 పరుగులకే చిత్తై, చెత్త రికార్డులు మూటగట్టుకున్న ఆఫ్ఘన్లు..

ఇంకా చదవండి

News18 తెలుగు
Trending: సింహాద్రి అప్పన్నకు రూ. 100 కోట్ల చెక్.. అకౌంట్‌లో ఎంత డబ్బు ఉందంటే..
Trending: సింహాద్రి అప్పన్నకు రూ. 100 కోట్ల చెక్.. అకౌంట్‌లో ఎంత డబ్బు ఉందంటే..
12hr39 shares
మీరు విన్నది నిజమే అక్షరాల చెక్ పై 100 కోట్ల రూపాయలు అని రాసిన భక్తుడు ఆ చెక్ ను విశాఖ పట్నం లోని సింహాచలంలో ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం హుండీలో వేయటం గమనార్హం.సాధారణంగా దేవాలయానికి వచ్చిన భక్తులు వారు మొక్కుకున్న మొక్కులను ధన రూపంలోనూ, వస్తు రూపంలోనూ, తలనీలాలు సమర్పించి తీర్చుకుంటూ ఉంటారు.

ఇంకా చదవండి

ETV Bharat తెలుగు
Praggnanandhaa Chess : మనోడు ఓడినా రాజే.. అప్పుడు ఆనంద్.. ఇప్పుడు ప్రజ్ఞానంద్!
Praggnanandhaa Chess : మనోడు ఓడినా రాజే.. అప్పుడు ఆనంద్.. ఇప్పుడు ప్రజ్ఞానంద్!
1hr40 shares
Praggnanandhaa Chess : అతను ఫైనల్స్​లో పరాజయం ఎదుర్కొనుండచ్చు.. రన్నరప్‌తో సరిపెట్టుకోవచ్చు.. కార్ల్‌సన్‌ సవాలును ఈ సారి దాటలేకపోవచ్చు.. కానీ ప్రజ్ఞానంద మాత్రం ఎక్కడున్నా రాజే!

ఇంకా చదవండి

Anand Mahindra: ప్రజ్ఞానందపై ఆనంద్ మహీంద్రా ట్వీట్.. నువ్వు ‘రన్నరప్’ కాదు..
Anand Mahindra: ప్రజ్ఞానందపై ఆనంద్ మహీంద్రా ట్వీట్.. నువ్వు ‘రన్నరప్’ కాదు..
14hr40 shares
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం.. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ చైర్మన్ ‘ఆనంద్ మహీంద్రా’ (Anand Mahindra) ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎన్నెన్నో ఆసక్తికరమైన అంశాలను ట్విటర్ వేదికగా పోస్ట్ చేస్తూ ఉంటాడు.

ఇంకా చదవండి

News18 తెలుగు
Listeria Infection: భయపెడుతున్న లిస్టెరియా ఇన్ఫెక్షన్ వ్యాధి ..ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త
Listeria Infection: భయపెడుతున్న లిస్టెరియా ఇన్ఫెక్షన్ వ్యాధి ..ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త
3hr39 shares
Listeria Infection: అమెరికా వాసులు ఆందోళనకు గురుతున్నాుర. తాజాగా మిల్క్‌షేక్‌లు తాగి ముగ్గురు చనిపోయారు. దీనికి కారణం వాళ్లు తాగిన మిల్క్ షేక్‌ కలుషితం కావడం వల్ల లిస్టేరియా బ్యాక్టీరియా అనే ఇన్ఫెక్షన్ సోకడమే కారణమని గుర్తించారు.అసలు ఆ బ్యాక్టిరీయా ఏంటీ ..?

ఇంకా చదవండి

TV9 తెలుగు
Team India: విరాట్ కోహ్లీ ఇన్‌స్టా పోస్ట్‌పై బీసీసీఐ ఫైర్.. ఆటగాళ్లందరికీ కీలక సూచనలు..
Team India: విరాట్ కోహ్లీ ఇన్‌స్టా పోస్ట్‌పై బీసీసీఐ ఫైర్.. ఆటగాళ్లందరికీ కీలక సూచనలు..
2hr3 shares
Indian Cricket Team: సోషల్ మీడియాలో తమ ఫిట్‌నెస్ స్కోర్‌ల గురించి ఎటువంటి సమాచారం ఇవ్వవద్దని భారత జట్టు మేనేజ్‌మెంట్ ఆటగాళ్లను కోరింది. విరాట్ కోహ్లీ పోస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత మేనేజ్‌మెంట్ ఈ సలహా ఇచ్చింది.

ఇంకా చదవండి

News18 తెలుగు
Shani Gochar 2023 : 2025 వరకు ఈ రాశుల వారిదే రాజ్యం.. డబ్బుకు డబ్బు.. పేరుకు పేరు.. మీరున్నారా?
Shani Gochar 2023 : 2025 వరకు ఈ రాశుల వారిదే రాజ్యం.. డబ్బుకు డబ్బు.. పేరుకు పేరు.. మీరున్నారా?
18hr38 shares
జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో సంచరిస్తుంది. దాని ప్రభావం అన్ని రాశిచక్ర గుర్తుల వారిపై ఉంటుంది. శని అన్ని గ్రహాలలో నెమ్మదిగా కదులుతున్న గ్రహంగా పరిగణించబడుతుంది.

ఇంకా చదవండి

4 రోజుల్లో 25 వేల కోట్లు
4 రోజుల్లో 25 వేల కోట్లు
7hr2 shares
జోరు మీదున్న దేశీయ ఫిన్‌టెక్‌ రంగంలో భారీ అంచనాలతో అడుగుపెట్టిన ముకేశ్‌ అంబానీ గ్రూప్‌ కంపెనీ జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (జియో ఫిన్‌) శరవేగంగా మార్కెట్‌ విలువను కోల్పోయింది.
ఇంకా చదవండి