NationalTechnology

“చంద్రయాన్_3” తర్వాత.. జాబిల్లి మీద ఏం జరగబోతోంది?

చంద్రయాన్_2 విఫలమైన తర్వాత ఇస్రో చేపట్టిన చంద్రయాన్_3 ప్రయోగం విజయవంతమైంది. ల్యాండర్ సేఫ్ గా ల్యాండ్ కావడంతో జాబిల్లి దక్షిణ ధ్రువం మీద భారత్ జెండా పాతింది.

ఇతర దేశాలకు సాధ్యం కాని రికార్డును సృష్టించింది. చంద్రయాన్_3 సగర్వంగా జాబిల్లి మీద అడుగు పెట్టింది.40 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇస్రో అనుకున్న లక్ష్యాలను విక్రమ్ సాధించింది. సరే ఈ విజయం పూర్తయిన తర్వాత.. తదుపరి ఏమిటి అనే ప్రశ్న అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది.

కొన్ని గంటల్లో..

కొన్ని గంటల తర్వాత ల్యాండర్లోని రోవర్ బయటకు వచ్చి పరిశోధనలు చేస్తుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సేఫ్ గా ల్యాండ్ అయిన తర్వాత కూడా ల్యాండర్ నుంచి రోవర్ ఎందుకు బయటకు రాదంటే పది మీటర్ల ఎత్తు నుంచి ల్యాండర్ కిందికి జారి పడినప్పుడు.. ఆ తాకిడికి పైకి లేచిన చంద్రధూళి సర్దుకోవడానికి కొన్ని గంటల సమయం పడుతుంది. అంతా మొత్తం సద్దుమణిగిన తర్వాత ల్యాండర్లోని రోవర్ బయటకు వస్తుంది. అప్పుడు ఆ రెండూ పరస్పరం ఫోటోలు తీసుకొని భూమికి పంపుతాయి. ఆ రెండూ సురక్షితంగా ఉన్నాయి అనడానికి ఆ ఫోటోలే నిదర్శనం. దీంతో చంద్రయాన్_3 పూర్తిగా విజయవంతమైనట్టు లెక్క.