AP

పవన్ కళ్యాణ్ కిరాయి కోటిగాడు; కమ్మవర్గంపైనా అంబటి రాంబాబు షాకింగ్ కామెంట్స్!!

ఖమ్మంలో తనపై జరిగిన దాడిపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు మరోమారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై జరిగిన దాడిని చిన్నదిగా చూడొద్దని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. తనపై జరిగిన దాడి వెనుక భారీ కుట్ర ఉందని అంబటి రాంబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. వ్యక్తులపై భౌతిక దాడులకు పాల్పడిన ఏ పార్టీ కానీ వ్యక్తి కానీ బతికి బట్ట కట్టలేదని అంబటి రాంబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.

 

తనను భౌతికంగా లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ఇలా చేస్తున్నారని ఇంతకుముందే తాను చెప్పినట్టుగా అంబటి రాంబాబు తనపై దాడి చేసిన వారిని 9 మందిని గుర్తించారని, వారిలో ఆరుగురిని అరెస్టు చేశారని వారంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారని అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో కమ్మ సామాజిక వర్గంపైన నిప్పులు చెరిగిన అంబటి రాంబాబు కమ్మ వర్గంలో ఉగ్రవాదులు తయారయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

వారు తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. అసెంబ్లీలో తాను ఎప్పుడు భువనేశ్వరిని తప్పుగా మాట్లాడలేదని మంత్రి అంబటి రాంబాబు వివరణ ఇచ్చారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ పై టార్గెట్ చేసిన మంత్రి అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ అంటే పీకే కాదు అంటూ అభివర్ణించారు.

 

చంద్రబాబును ఏదైనా అంటే పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పడుకుంటాడు అని, కానీ ఇతరుల విషయాల్లో పవన్ కళ్యాణ్ స్పందించడని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ పీకే కాదు కేకే అంటూ పేర్కొన్న ఆయన పవన్ కళ్యాణ్ కిరాయి కోటిగాడు అంటూ విమర్శలు గుప్పించారు.

 

పవన్ కళ్యాణ్ కేవలం ప్రగల్భాలు పలుకుతూ ఉంటారని చంద్రబాబును ఏమైనా అంటే మాత్రం రోడ్డు మీద పడుకుంటారు అని విమర్శలు గుప్పించారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో టిడిపి అంత బలంగా ఉంటే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయొచ్చు కదా అని అంబటి రాంబాబు పేర్కొన్నారు