రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మాజీ ఎమ్మెల్యేల తీరు మాత్రం మారటం లేదు. నారాయణ్ ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి నిర్వాకం.. స్థానికులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఓటమి తర్వాత ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఖాళీ చేసి.. కొత్తగా ఎన్నికైనా వారికి ఇవ్వాల్సిన ఆయన.. ఆ ఆఫీస్‌లోనే మంతనాలు చేస్తున్నారు. కార్యకర్తలతో భేటీ అవుతూ.. బిజీబిజీగా ఉన్నారు.
ఓటమి తర్వాత BRS అధినేత, మాజీ ముఖ్యమంత్రి KCR రాజీనామా చేసి ప్రగతి భవన్ ను విడిచి వెళ్లిపోయారు. ఇంకా చాలామందీ వారి ఆఫీసులను ఖాళీ చేసి కొత్తగా ఎన్నికైన వారి కోసం ఉంచారు. కానీ… నా రూటే సెపరేటు అంటున్నారు భూపాల్‌రెడ్డి.
ఇదేంటని మాజీ ఎమ్మెల్యేను ప్రశ్నించగా… తనకు అధికారుల నుంచి ఆదేశాలు రాలేదని చెబుతున్నారు భూపాల్‌రెడ్డి. ఆదేశాలు వస్తేనే తాను ఆఫీసును ఖాళీ చేస్తామని చెబుతున్నారు. ఖాళీ చేయమని ఆదేశాలు వస్తాయా లేదా ఆయనే ఖాళీ చేసి తన గౌరవాన్ని కాపాడుకుంటారో చూడాలి.