భారీ అంచనాలతో ఈ రోజు విడుదలై హిట్ టాక్ తో దూసుకెళ్తున్న సినిమా ‘సలార్’. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ను అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా చూపించారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ దాదాపు రూ.160 కోట్లకు సలార్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు నెట్టింట ప్రచారం నడుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.