CINEMA

సిద్దార్థ్ తో రిలేషన్ హీరోయిన్ అదితి రావ్ హైదరీ క్లారిటీ..

హీరోయిన్స్ పెళ్లి, లవ్ స్టోరీల గురించి నిత్యం ఎదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఆ హీరోయిన్ పెళ్లి చేసుకోబోతుంది. ఫలానా హీరోతో రిలేషన్ లో ఉంది అంటూ రకరకాల వార్తలు వినిపిస్తూ ఉంటాయి. చాలా మంది వాటిని పట్టించుకోరు. కానీ కొంతమంది మాత్రం ఇలాంటి వార్తలపై ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ ఉంటారు. తాజాగా ఈ బ్యూటీ కూడా తన రిలేషన్ షిప్ గురించి స్పందించింది. ఆ బ్యూటీ ఎవరో కాదు అదితి రావు హైదరి. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తోన్న అదితికి మంచి క్రేజ్ ఉంది. అయితే ఈ బ్యూటీ బొమ్మరిల్లు హీరో సిద్దార్థ్ తో ప్రేమలో ఉందని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలకు బలం చేకూరేలా ఈ ఇద్దరు చట్టపాట్టలేసుకు బయట తిరుగుతూ మీడియా కట్టుటాపడ్డారు కూడా

 

అలాగే రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక పాటకు స్టెప్పులేసి ఆకట్టుకున్నారు కూడా.. అయితే వీరి రిలేషన్ గురించి ఇంతవరకు ఎక్కడా అటు అదితి కానీ. ఇటు సిద్దార్థ్ కానీ మాట్లాడలేదు. తాజాగా ఈ విషయం పై అదితి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.

 

అదితి రావ్ హైదరీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని విషయాలను గురించి ఇతరులు మాట్లాడనక్కర్లేదు.. ఆ విషయాలను పవిత్రంగా భావించి వాటిని వదిలేయాలని పేర్కొంది. సిద్దార్థ్ తో ఉన్న లవ్ లో ఉన్నట్టు చెప్పలేదు.. కానీ అది ఒక పవిత్రమైన విషయం అన్నట్లుగా చెప్పుకొచ్చింది అదితి.