CINEMA

హిమాలయాల్లో ఒంటిపై నూలుపోగు లేకుండా తిరుగుతున్న స్టార్ హీరో..

బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్. శక్తి, ఊసరవెల్లి, తుపాకి వంటి సినిమాల ద్వారా తెలుగు తెరకు సుపరిచితుడైన నటుడు. బాలీవుడ్‌లో హీరోగా పలు సినిమాల్లో కనిపించారు. యాక్షన్ ఎంటర్‌టైన్మెంట్ సినిమాలతో దేశవ్యాప్తంగా సినీ ప్రియులకు చేరువ అయ్యారు.

 

ప్రస్తుతం అతను నటిస్తోన్న రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. వచ్చే ఏడాది విడుదలకు సిద్ధం అవుతున్నాయి. షేర్ సింగ్ రాణా, క్రాక్ సినిమాలపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ రెండూ కూడా యాక్షన్ థ్రిల్లర్లుగా తెరకెక్కుతున్నాయి. క్రాక్ సినిమాకు ప్రొడ్యూసర్‌గానూ వ్యవహరిస్తోన్నాడు విద్యుత్ జమ్వాల్. సీబీఐ డీసీపీ అర్జున్ సింధియా క్యారెక్టర్‌ను పోషిస్తోన్నాడు.

 

Who I am not which is the first step of knowing Who am I, says Vidyut Jammwal

2024 ఫిబ్రవరి 23వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. షూటింగ్ దాదాపుగా ముగిసింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు, కొంత ప్యాచ్ వర్క్ కొనసాగుతోంది. షూటింగ్ నుంచి విరామం లభించడంతో హిమాలయాలకు తరలి వెళ్లాడు విద్యుత్ జమ్వాల్.

 

ప్రస్తుతం విద్యుత్ జమ్వాల్.. హిమాలయాల్లో ఒంటరిగా ఒంటిపై నూలుపోగైనా లేకుండా గడుపుతున్నాడు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను అతను తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. తాను ఇక్కడే సేద ఉంటానని, ఏడాదిలో కనీసం 10 రోజులైనా హిమాలయాల ఒడిలో సేద తీరుతుంటానని పేర్కొన్నాడు.

 

ఎంతో విలాసవంతమైన జీవితాన్ని వదిలివేసి ఇలా ఓ సాధువుగా జీవించడానికే తాను ఇష్టపడతానని చెప్పాడు. ఈ ప్రకృతి ప్రసాదించే ప్రతి అణువులోనూ ఎంతో లగ్జరీ ఉందని అన్నాడు. ప్రకృతిలోనే చాలా సౌకర్యంగా ఉన్నట్టనిపిస్తోందని వ్యాఖ్యానించాడు. తనను తాను అన్వేషించుకోవడంలోనే అసలైన తృప్తి ఉందని పేర్కొన్నాడు.