APCINEMATELANGANA

ఎన్నికలకు సిద్ధమైన రాములమ్మ.. అక్కడి నుంచే పోటీ?

తెలంగాణ సాధన కోసం తల్లి తెలంగాణ పార్టీ పెట్టి.. ఉద్యమ సమయంలో బీఆర్‌ఎస్‌లో, తర్వాత కాంగ్రెస్‌లో ప్రస్తుతం బీజేపీలో చేరిన విజయశాంతి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది.

మూడు పార్టీలు తిరిగినా ఆమెకు ప్రత్యేకమైన నియోజకవర్గం అంటూ లేదు. తన పూర్వికులది ఏటూరు నాగారం అని చెప్పుకుంటారు.. అదీ కూడా ఓసే..రాములమ్మ సినిమా తర్వాతనే. అయినా ఆమె ఎప్పుడూ వరంగల్‌ జిల్లా వైపు చూడలేదు. ఓ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని అక్కడే పని చేసుకుందామన్న ఆలోచన చేయలేదు. కానీ ఎన్నికల్లో పోటీకి చాన్సివ్వకపోతే మాత్రం ఫైర్‌ అయిపోతూ ఉంటారు.

బీఆర్‌ఎస్‌లో మెందక్‌ నుంచి..
బీఆర్‌ఎస్‌లో చేరాక.. కేసీఆర్‌ .. అత్యంత సేఫ్‌ సీటు అయిన మెదక్‌ ఇచ్చారు. మెదక్‌ ఎంపీ అయ్యారు. కానీ చివరికి ఆమె బయటకు రావాల్సి వచ్చింది. కాంగ్రెస్‌లో చేరారు. అదే మెదక్‌ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఘోరా పరాజయం పాలయ్యారు. మళ్లీ మెదక్‌ వైపు చూడలేదు. కాంగ్రెస్‌లో ప్రచార కమిటీ చైర్మన్‌గా ఉన్నారు కానీ.. కాంగ్రెస్‌ లాభం లేదని బీజేపీలో చేరారు. బీజేపీలో అసలు ఏ పదవీ దక్కలేదు. అసలు నియోజకవర్గమే లేకుండా పోయింది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ ఇవ్వాలంటే ఆమెకంటూ ఓ నియోజకవర్గం ఉండాలి కదా అనే సైటెర్లు బీజేపీలోనే వినిపిస్తున్నాయి.

సేఫ్‌ నియోజకవర్గం వెతుకున్న రాములమ్మ
ఇక అన్నింటికన్నా సేఫ్‌ నియోజకవర్గం కూకట్‌పల్లి అని.. అక్కడైతే.. ఏ సమస్యా ఉండదని.. అక్కడి టిక్కెట్‌ కోసం ప్రయత్నిస్తున్నట్లుగా బీజేపీ వర్గాలు గుసగుసలాడుతుతున్నాయి. ఆమె కూడాతరచూ కూకట్‌పల్లిలో పర్యటిస్తున్నారు. అక్కడ అయినా టిక్కెట్‌ ఇస్తారో లేదో కానీం తన నియోజకవర్గం కూకట్‌పల్లి అని రాములమ్మ డిసైడయినట్లుగా చెబుతున్నారు.

మెదక్‌ టికెట్‌ ఇచ్చే ఆలోచనలో బీజేపీ..
ఇదిలా ఉంటే.. విజయశాంతి గతంలో మెదక్‌ నుంచి లోక్‌సభకు పోటీచేశారు. అక్కడ కొన్ని పనులు చేసి ఉన్నందున ఈసారి మెదక్‌ నుంచి అసెంబ్లీ బరిలో నిలపాలని బీజేపీ భావిస్తోంది. పద్మాదేవేందర్‌రెడ్డి ఇప్పటికే రెండుసార్లు గెలిచారు. ఈ నేపథ్యంలో ఆమెపై వ్యతిరేకత కూడా ఉంది. దీంతో విజయశాంతి గెలుపు ఈసారి ఈజీ అని కమలం నేతలు భావిస్తున్నారు. మరి విజయశాంతి ఆశిస్తున్న కూకట్‌పల్లి టికెట్‌ ఇస్తారా.. లేక బీజేపీ అనుకుంటున్న మెదక్‌ టికెట్‌ ఇస్తారా అనేది చూడాలి.