CINEMA

‘కాంతార చాప్టర్ 1’ ఫస్ట్ లుక్.. టీజర్ రిలీజ్..

క‌న్న‌డ యాక్టర్ రిషభ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి రికార్డ్ స్థాయి కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రం కాంతార. గత ఏడాది విడుదలైన ఈ మూవీ అప్పటివరకు చిన్న సినిమాలపై ఉన్న ఒపీనియన్ ని ఒక్కసారి మార్చింది. కంటెంట్ క్లియర్ గా ఉంటే చాలు హిట్ అవ్వడానికి భారీ బడ్జెట్ అవసరం లేదు అని నిరూపించింది ఈ మూవీ. ఈ మూవీ అందుకున్న భారీ సక్సెస్ తో ఈ మూవీకి ఫ్రీక్వెల్ పై అంచనాలు భారీగా ఉన్నాయి.

 

కాంతార చాప్టర్ 1.. అంటూ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్న ఈ మూవీ నుంచి ఈరోజు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. దీంతోపాటుగా టీజర్ ని కూడా విడుదల చేసింది చిత్ర బృందం. కాంతారావు మూవీ లో రిషబ్ శెట్టి క్లైమాక్స్ సీన్ తో టీజర్ మొదలవుతుంది. కదంబాల పాలన సమయంలో ఒక లెజెండ్ జన్మించాడు అనే బేస్ వాయిస్ తో పాటుగా కండలు తిరిగిన దేహంతో.. దృఢమైన బాడీ తో.. ఒంటినిండా రక్తపు మరకలతో భీభత్సంగా ఉన్న రిషబ్ శెట్టి ని చూపిస్తారు. ఇది అతని తండ్రి పాత్ర అని అర్థం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న చిత్రం ఇంతకుముందు వచ్చిన చిత్రానికి ఫ్రీక్వెల్.. కాబట్టి మనం ఇందులో చూసేది మాక్సిమం మొదటి రిషబ్ శెట్టి కి సంబంధించిన విషయాలు.

 

రిషబ్ తండ్రి జీవితం.. అతను ఎక్కడికి వెళ్ళాడు.. ఎలా చనిపోయాడు.. చనిపోయాక ఏమయ్యాడు.. అసలు ఆ పల్లెలోని సాంప్రదాయాల వెనుక రహస్యం ఏమిటి? దేవుడు ప్రత్యేకంగా ఆ తెగవాళ్లనే ఎందుకు పూనుతాడు? లాంటి ఎన్నో డౌట్స్ మనకు కాంతార మూవీ చూసినప్పుడు కలిగి ఉంటాయి.. అంతేకాదు కాంతార మూవీ చూసినప్పుడు చాలామందికి.. సినిమాలో అక్కడక్కడ కొన్ని విషయాలను అలా టచ్ చేసి వదిలేసారు అన్న ఫీలింగ్ కలిగింది.

 

అప్పుడు కలిగిన ఎన్నో ప్రశ్నలకు ఇప్పటి సినిమా సమాధానంగా వస్తుంది అని తెలుస్తుంది.మొదట వచ్చిన కాంతారా చిత్రానికి అప్పట్లో 16 కోట్ల రూపాయలు వరకు బడ్జెట్ అయింది. ఊహించని కలెక్షన్స్ రా పట్టడంతో ఈ చిత్రానికి ఫ్రీక్వెల్ ఏకంగా 120 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించినట్లు టాక్. కేవలం ప్రీ ప్రొడక్షన్ కోసమే ఈ చిత్రానికి 20 కోట్ల రూపాయలు.. మొదటి పార్ట్ బడ్జెట్ కంటే ఇప్పుడు రాబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ ఖర్చు ఎక్కువ..ఇంత ధైర్యం చేశారంటే మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో చూడండి.