CINEMA

గుంటూరు కారం సినిమాకు ప్రత్యేక షోలు..

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోతున్న తాజా సినిమా గుంటూరు కారం గురించి అందరికీ తెలిసిందే. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవిరి 12వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ బజ్ ఏర్పడింది. ఎప్పుడెప్పుడు ఈ సనిమా చూస్తామా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలోనే సినిమా నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు తెలంగాణ ధరలు పెంచుకుంటామని పర్మిషన్ అడగ్గా… రాష్ట్ర ప్రభుత్వం స్పందిచింది. టికెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది.

తెలంగాణ సర్కారు ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వండతో ఈ సినిమా టికెట్ రేట్లు భారీగా పెరుగనున్నాయి. ఇలా నైజాంలో గుంటూరా కారం చిత్రానికి భారీ కలెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. మరి ఈ సినిమా టికెట్ల ధరలు ఎలా ఉన్నాయి, ఎన్ని షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది..