సంక్రాంతి బరిలో చాలా సినిమాలు ఉన్నాయి.. అయితే చుక్కలన్ని ఒకవైపు చంద్రుడు మాత్రమే ఒకవైపు అన్నట్టు ఉంది గుంటూరు కారం పరిస్థితి. ఈ మూవీ కి సంబంధించిన చిన్న అప్డేట్ వచ్చినా సరే ఫాన్స్ దాన్ని క్రేజీగా వైరల్ చేస్తున్నారు. ఇక ఈ మూవీలో మహేష్ బాబు ఎప్పుడూ లేనంత మాస్ గెటప్ లో దంచేస్తున్నాడు. మూవీ నుంచి వచ్చిన మంచి మసాలా సాంగ్ కూడా ప్రేక్షకులలో బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం ఈ చిత్రంపై అంచనాలు భారీగా నెలకొని ఉన్నాయి.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ,మహేష్ బాబు కాంబోలో ముచ్చటగా వస్తున్న మూడవ చిత్రం గుంటూరు కారం. ఈ మూవీ లో త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ ఎంత ఘాటుగా ఉంటాయో.. మహేష్ బాబు చెప్పే స్టైల్ అంతకంటే ఘాటుగా ఉంటుందట. షూటింగ్ చివరి దశలో ఉండడంతో చిత్ర బృందం వీలైనంత త్వరగా పాటలు కంప్లీట్ చేసి షూటింగ్ కు ప్యాకప్ చెప్పాలని ట్రై చేస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్గా శ్రీ లీల నటిస్తుండగా ..సెకండ్ లీడ్ లో మీనాక్షి చౌదరి కనిపించబోతోంది.
గుంటూరు ప్రాంతం బ్యాక్ డ్రాప్ లో మిర్చి యార్డ్ కాంబినేషన్లో.. ఫుల్ మాస్ కమర్షియల్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు జనవరి 12న రాబోతోంది. ఇంకా గట్టిగా నెల కూడా టైం లేదు.. ఒకపక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తూనే మరో పక్క పెండింగ్ ఉన్న షూటింగ్ ని కంప్లీట్ చేయడంలో త్రివిక్రమ్ బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఒక సాంగ్ కేరళలో షూటింగ్ చేయాల్సి ఉంది.. కానీ సమయం తక్కువగా ఉన్న కారణంతో సాంగ్ కేరళలో లైవ్ లొకేషన్స్ లో చేయలేక అదే వాతావరణాన్ని సెట్ రూపంలో వేస్తున్నారట.
అందుకే ఈ సాంగ్ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో ఫిక్స్ అయింది. పెండింగ్ ఉన్న ఈ సాంగ్ ని వీలైనంత వేగంగా పూర్తి చేయడంపై ప్రస్తుతం త్రివిక్రమ్ తన ఫోకస్ పెట్టారట. ఇక ఈ 30 రోజుల్లో ఔట్ పుట్ రెడీ చేయడంతో పాటు రిలీజ్ కాపీని కూడా సిద్ధం చేసుకోవాలి. ఇక మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ఉండనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో అనుకున్న టైంకి సినిమా రెడీ అవుతుందా అన్న సందేహాలు అక్కడక్కడ వినిపిస్తున్నాయి. మామూలుగా సినిమా రిలీజ్ విషయంలో ఎప్పుడూ పక్క ప్లానింగ్ తో ఉండే త్రివిక్రమ్ గుంటూరు కారం విషయంలో కాస్త లెక్క తప్పడేమో అనిపిస్తుంది. కానీ త్రివిక్రమ్ పట్టుదల చూస్తే సినిమా అనుకున్న డేటు కే విడుదల అయ్యేలా కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.