తెలంగాణ రాష్ట్రంలో 10 ఉమ్మడి జిల్లాలకు ఇంఛార్జీ మంత్రులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ జిల్లాకు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాకు దామోదర రాజనర్సింహ, ఖమ్మం జిల్లాకు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నియమించారు.
రంగారెడ్డి జిల్లాకు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వరంగల్ జిల్లాకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ జిల్లాకు పొన్నం ప్రభాకర్, మెదక్ జిల్లాకు కొండా సురేఖ, ఆదిలాబాద్ జిల్లాకు సీతక్క, నల్గొండ జిల్లాకు తుమ్మల నాగేశ్వరరావు, నిజామాబాద్ జిల్లాకు జూపల్లి కృష్ణారావు ఇంఛార్జీలుగా నియమితులయ్యారు.
తెలంగాణలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీ
తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్‌లు, ఒక ఐపీఎస్ అధికారిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రవాణా శాఖ కమిసనర్‌గా జ్యోతి బుద్ధప్రకాష్‌ను నియమించారు. ఎక్సైజ్ కమిషనర్‌గా శ్రీధర్‌ను నియమించారు. టీఎస్ఐఐసీ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్న భారతి హోలికేరిని సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా గౌతమ్ ను నియమించారు. ఇంటర్ బోర్డ్ కార్యదర్శిగా శ్రుతి ఓజాకు బాధ్యతలు అప్పగించారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా డీఎస్ చౌహాన్ నియమితులయ్యారు. గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా ఈవీ నరసింహా రెడ్డిని నియమించారు. కాగా, తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తున్న విషయం తెలిసిందే.