TELANGANA

ప్రజాపాలనలో దరఖాస్తు చేసారా, ఏ పథకానికి మీరు అర్హులు – ఇలా చెక్ చేసుకోండి..!!

ఎన్నికల గ్యారంటీల అమలు దిశగా రేవంత్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వంద రోజుల్లో హామీలను అమలు చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పటికే రెండు పథకాలు అమల్లోకి వచ్చాయి. మిగిలినవరి మార్చి 15 లోగా ప్రారంభించాల్సి ఉంది. దీనికి సంబంధించి ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. ఇక దరఖాస్తు చేసిన వారు ఏ పథకానికి అర్హులు, వారి అప్లికేషన్ స్టేటస్ ఏంటనేది తెలుసుకొనేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.

 

దరఖాస్తుల పరిశీలన: కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీల అమలు కోసం ముందుగా దరఖాస్తులు స్వకరించింది .రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను ప్రస్తుతం కంప్యూటరైజ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.25 కోటి దరఖాస్తులు పలు సంక్షేమ పథకాలకోసం వచ్చాయి. వీటిలో ఎక్కువ శాతం రేషన్ కార్డులు, వంటగ్యాస్ సబ్సిడీ కోసం వచ్చినట్లు గుర్తించారు.

 

అన్ని పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికంగా భావిస్తుండటంతో..కొత్త కార్డుల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు 75 శాతం దరఖాస్తుల వివరాలను కంప్యూటీకరణ చేసారు. మరో వారం పది రోజుల్లోనే అప్లికేషన్ల ఎంట్రీ ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.

 

అర్హతపై స్పష్టత: దరఖాస్తు దారులు తమ అప్లికేషన్ ఏమైందో తెలుసుకోవటం కోసం కొత్త విధానం ప్రారంభించారు. పథకాల కోసం దరఖాస్తు చేసిన వారు https.//prajapalana.telangana.gov.in/ అని లాగిన్ అవ్వటం ద్వారా తమ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఈ వెబ్ సైట్ లో లాగిన్ అవ్వటం ద్వారా చెక్ యువర్ అప్లికేషన్ స్టేటస్ అనే సరికొత్త ఆప్షన్ కనిపిస్తోంది.

 

దరఖాస్తు దారులకు కేటాయించిన అప్లికేషన్ నంబర్ నమోదు చేస్తే మన దరఖాస్తు ఏ స్థితిలో ఉందో అప్డేట్ వస్తుంది. అదే సమయంలో ఎన్ని పథకాలకు అర్హత ఉందనే అంశాన్ని తెలుసుకొనే అవకాశం ఉంది. దరఖాస్తు దారులు తమ అప్లికేషన్ లో ఇచ్చిన సమాచారంలో ఏమైనా లోపాలు ఉన్నాయా.. ఇంకా ఎలాంటి వివరాలు అధికారులకు అందించాలి అనే అంశాలు కూడా ఈ ఆన్ లైన్ విధానం ద్వారా అందుబాటులోకి తెచ్చారు.

 

అమలు పై కసరత్తు: ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని మంత్రులు చెబుతున్నారు. ప్రస్తుత దరఖాస్తుల వడపోత, స్క్రూటినీ పూర్తయిన తరువాత పథకాల అమలు పైన నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ప్రజాపాలన వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు స్టేటస్ తో తెలుసుకోవటంతో పాటుగా ఏ పథకాలకు అర్హత ఉందనేది క్లారిటీ రానుంది.

 

దీని ద్వారా లబ్దిదారులకు ముందుగానే తమకు అందే పథకాల పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక.. త్వరలోనే పథకాల అమలుతో పాటుగా అర్హుల జాబితా ను ఖరారు పైన ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.