AP

మాజీ మంత్రి, వైసీపీ నేత ఇంటికి వైఎస్ షర్మిల….

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా కాలుపెట్టిన వైఎస్ షర్మిల రాజకీయంగా శరవేగంగా పావులు కదుపుతున్నారు. ఏపీలో బాధ్యతలు చేపట్టిన తొలినాటి నుండే ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతున్న వైఎస్ షర్మిల మరోవైపు తమతో కలిసి వచ్చే నాయకులను కాంగ్రెస్ పార్టీ బాట పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకపక్క కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూనే, మరొకపక్క ఏపీలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలపై వైఎస్ షర్మిల ఫోకస్ పెట్టారు.

 

ఈరోజు విజయనగరం కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వైయస్ షర్మిల అక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ చెప్పారని, ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ప్రత్యేక హోదా కావడంతో, ఈ విషయం ప్రజల వద్దకు చేరేలా చూడాలని వైయస్ షర్మిల శ్రేణులకు సూచించారు.

 

ఇక ఇదే క్రమంలో కాంగ్రెస్‌కు పూర్వ‌వైభ‌వం తీసుకొచ్చేందుకు న‌డుం బిగించిన వైఎస్ షర్మిల ఈ క్ర‌మంలోనే మాజీ మంత్రి, వైసీపీ నేత కొణతాల రామకృష్ణ ఇంటికి వెళ్లారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై ఆయ‌న‌తో చర్చించారు. ఈ భేటీ విశాఖ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కొణతాల రామకృష్ణను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే వ్యూహంలో భాగంగా ఆమె కొణతాల రామకృష్ణతో భేటీ అయినట్టుగా రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంది.

 

అయితే ఇటీవలే కొణతాల రామకృష్ణ జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు ప్రకటన కూడా చేశారు. ఈ క్ర‌మంలో షర్మిలతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మొత్తంగా ఏపీ రాజకీయాలలోకి అడుగుపెట్టిన వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె వేసే ప్రతీ అడుగును రాజకీయ వర్గాలు జాగ్రత్తగా గమనిస్తున్నాయి.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని కూడా కోల్పోయి, అంపశయ్య మీద ఉన్న సమయంలో పార్టీ పగ్గాలు చేపట్టిన వైయస్ షర్మిల వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కీలకంగా వ్యవహరించబోతుందని తన చర్యల ద్వారా స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనా వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ నుండి ఏపీలో బలంగా పోరాటం చేస్తూ ఉండడం వైయస్ జగన్మోహన్ రెడ్డికి నష్టం చేస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహము