తెలంగాణ రాష్ట్రంలో డీఎస్పీల బదిలీలు కొనసాగుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పని చేస్తోన్న 95 మంది డీఎస్పీలను బుధవారం బదిలీ చేయగా.. తాజాగా గురువారం మరో 26 మంది డీఎస్పీలను బదిలీ అయ్యారు. ఈ మేరకు గురువారం హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే రెవెన్యూ, ఆబ్కారీ, పంచాయతీరాజ్ శాఖలో పెద్ద ఎత్తున అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.
బుధవారం హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల్లో కొనసాగుతున్న డీఎస్పీలను, ఏసీపీలను బదిలీ చేశారు. రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ అధికారులను బదిలీ చేశారు. మూడేళ్లుగా ఒకేచోట పని చేస్తోన్న, సొంత జిల్లాల్లో పని చేస్తోన్న అధికారులను బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ గత డిసెంబర్లో ఆదేశించింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వం అధికారులను బదిలీ చేసినట్లు తెలుస్తోంది.
అయితే, అంతకుముందు కూడా రాష్ట్రంలో అధికారుల బదిలీలు జరిగాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను భారీ మొత్తంలో బదిలీలు చేశారు. కొందరికి శాఖలను మార్చారు. ఇటీవల ఎంపీడీలోనూ కూడా భారీ సంఖ్యలో బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఎస్ఐ, సీఐలను కూడా బదిలీ చేశారు.