TELANGANA

విద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డ్ గుడ్‌న్యూస్…

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ సంచలన నిర్ణయం తీసుకుంది. పరీక్ష కేంద్రాలకు నిమిషం ఆలస్యం నిబంధన తొలగించింది. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్ష రాసేందుకు అనుమతించాలని నిర్ణయించింది. ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు 5 నిమిషాలు గ్రేస్ టైం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

 

 

ఇప్పటి వరకు 9 గంటల తర్వాత వచ్చిన విద్యార్థులను అనుమతించని అధికారులు. తాజా నిర్ణయంతో విద్యార్థులకు భారీ ఊరట లభించనుంది. అనేక మంది విద్యార్థులు ఒక నిమిషం నిబంధనతో పరీక్షలకు దూరమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం విద్యార్థులకు భారీ ఊరట కల్పించనుంది.

 

కాగా, పరీక్షకు ఆలస్యమయ్యాడనే కారణంతో అధికారులు అనుమతించడంతో ఫిబ్రవరి 29న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషయం విధితమే. నిర్దిష్ట కారణాల వల్ల విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా చేరుకుంటే ఐదు నిమిషాలు గ్రేస్ పీరియడ్ ను అనుమతించాలని ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారులు ఆయా జిల్లాల అధికారులకు, సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్లకు స్పష్టం చేశారు. దీంతో ట్రాఫిక్, ఇతర కారణాలతో పరీక్ష కేంద్రాలకు కొంత ఆలస్యంగా చేరుకునే విద్యార్థులకు ఊరట లభించనుంది