TELANGANA

మేడిగడ్డ ఏమైనా పర్యాటక ప్రాంతమా.. రేవంత్‍పై కవిత వ్యంగ్యస్త్రాలు.. !

కాళేశ్వరం.. ఒకప్పుడు ఉదయం లేచి మొదలు సాయంత్రం వరకు బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం గురించి మాట్లాడేవారు. ప్రపంచం ఇంత గొప్ప ప్రాజెక్టు ఎవరు కట్టలేదని చెప్పారు. కేసీఆర్ ను అపర భగీరథుడిగా కొనియాడేవారు. బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టుపై భారీగా ప్రచారం చేసుకుంది. ఈ ప్రచారం బీఆర్ఎస్ గొప్ప ముంచింది. వీరు ఎంతగా ప్రచారం చేసుకున్నారు.. మేడిగడ్డ కుంగిపోవడం వారికి అంత మైనస్ అయింది. ప్రాజెక్టు కట్టిన మూడేళ్లకే కుంగిపోవడంతో కేసీఆర్ సర్కార్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి.

 

అప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు పై మాట్లాడిన బీఆర్ఎస్ నేతలు ఆ మాట ఎత్తకుండా ప్రచారం చేశారు. కానీ ప్రజలు మాత్రం మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడాన్ని గుర్తుంచుకున్నారు. దీంతో బీఆర్ఎస్ కు పరాభవం తప్పలేదు. తాజాగా అధికారలోకి వచ్చిన కాంగ్రెస్ మేడిగడ్డ కుంగడంపై విచారణ ఆదేశిస్తామని ప్రకటించింది. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నిర్మాణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజల హక్కులను కాపాడడం కోసం తమ ప్రభుత్వం పాలన ఉంటుందని స్పష్టం చేశారు.

 

అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత సభ్యులందరినీ మేడిగడ్డ పర్యటనను తీసుకువెళ్తామని చెప్పారు. ప్రాజెక్ట్ ఎందుకు కుంగిపోయిందో.. తెలుసుకుంటామని పేర్కొన్నారు. అప్పుడే ఏం జరిగిందో తెలుస్తుందని రేవంత్ చెప్పారు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు అందరినీ తీసుకెళ్లడానికి అదేమైన టూరిస్ట్ స్పాటా? అంటూ ప్రశ్నించారు. నిపుణుల కమిటీ వేసి వారిని తీసుకెళ్లడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.

 

గవర్నర్ స్పీచ్ బాధాకరమని చెప్పారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలను నిరంకుశ ప్రభుత్వాలు అని ఎలా అంటారని ప్రశ్నించారు. మండలిలో మాకు మెజార్టీ సభ్యులు ఉన్నా.. ప్రభుత్వం రిక్వెస్ట్ మేరకు తాను మండలిలో ఇచ్చిన అమైండ్ మెంట్ ను వెనక్కి తీసుకున్నామని పేర్కొన్నారు. కవిత వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అప్పట్లో బీఆర్ఎస్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టు చూపించడానికి చాల మందిని బస్సుల్లో తీసుకెళ్లింది. అప్పుడు అది టూరిస్ట్ ప్లేసా అంటూ ప్రశ్నిస్తున్నారు.