కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడేందుకు లేచిన సమయంలో కౌశిక్ రెడ్డి ఆయనకు అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. దీంతో వివాదం మొదలైంది. నువ్వు ఏ పార్టీ అంటూ సంజయ్ కుమార్‌ను కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. ఇద్దరు ఎమ్మెల్యేలు పరస్పరం నెట్టుకున్నారు.
గొడవ ఎక్కువవ్వడంతో కౌశిక్ రెడ్డిని పక్కనున్ పోలీసులు కౌశిక్‌ను సమావేశం నుంచి బయటకు తీసుకెళ్లారు. కౌశిక్ రెడ్డి తీరును మంత్రి శ్రీధర్‌బాబు సైతం తప్పుబట్టారు. బయటకొచ్చిన కౌశిక్ రెడ్డి సంజయపై నిప్పులు చెరిగారు. సంజయ్‌కి దమ్ముంటే కాంగ్రెస్ టికెట్‌పై గెలవాలని సవాల్ విసిరారు. BRS బీఫామ్‌తో గెలిచిన సంజయ్ కుమార్ సిగ్గులేకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేనని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. BRS తరపున గెలిచి కాంగ్రెస్ తరపున మాట్లాడితే మేం చూస్తూ కూర్చోవాలా అని ప్రశ్నించారు. ఆయనను ఏ పార్టీ అని అడిగితే దాడి చేసినట్టా? అని ప్రశ్నించారు.
అయితే.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరుపై కాంగ్రెస్ నేతలు ఫైరవుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, కౌశిక్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. కౌశిక్ రెడ్డి ఒక రౌడీ, గుండాలాగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. ఆయన ఇలాగే ప్రవర్తిస్తే గుడ్డులూడదీసి కొట్టే రోజు వస్తుందని హెచ్చరించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం కౌశిక్ రెడ్డి తీరుపై తీవ్రంగా ఖండించారు.
తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కౌశిక రెడ్డి తీరుపై స్పందించారు. కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన ఘటనను ఖండిస్తున్నామన్నారు. వైసీపీ, కాంగ్రెస్‌ల నుంచి బీఆర్ఎస్లో చేరిన వ్యక్తి కౌశిక్‌రెడ్డి అని.. ఆయనా పార్టీ మార్పు గురించి మాట్లాడేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బూతు వ్యాఖ్యలపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు స్పందించాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఈ తరహా పద్ధతి సరికాదు అని మంత్రి పొన్నం వ్యాఖ్యానించరాు.