తెలంగాణ రాష్ట్రంలో రవాణా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన నిర్ణయాల ప్రకారం రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెంచడం కోసం కొత్త విధానాలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఐటీసీ కాకతీయ హోటల్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈటో మోటార్స్ నుంచి ఫ్లిక్స్ బస్, ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. రాష్ట్రంలోని ఈవీ పాలసీ ప్రకారం, రోడ్డు టాక్స్, రిజిస్ట్రేషన్ టాక్స్‌ను 2026 డిసెంబర్ 31 వరకు మినహాయింపు ఇచ్చినట్లు మంత్రి ప్రకటించారు. ఈ విధానం వల్ల కాలుష్యాన్ని తగ్గించడం, నగరంలో వాయు కాలుష్యాన్ని నియంత్రించడం సాధ్యమవుతుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లుగా.. నగరంలోని ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చాలని, ఇతర వాహనాలను కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడంలో ప్రభుత్వం సహకారం అందిస్తుందని చెప్పారు.
ఈటో మోటార్స్ ఫ్లిక్స్ బస్ ఎలక్ట్రిక్ బస్సును మొదటిసారి తెలంగాణలో ప్రారంభించడం, రాష్ట్రంలో పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్న కొత్త చర్యలు చూపిస్తాయని మంత్రి అభిప్రాయపడ్డారు. ఇంకా, రవాణా శాఖకి సంబంధించిన అన్ని నిబంధనలను పాటించాలని.. ఈవీ బస్సుల వినియోగం పెరిగితే, భవిష్యత్తులో మరిన్ని రకాల ఈవీ బస్సులు ప్రవేశపెట్టాలని అన్నారు. బలహీన వర్గాల బిడ్డగా బీసీ సంఘాల దగ్గరకు రావడానికి నేను సిద్ధమని, అందుకు రోడ్ మ్యాప్ ఇవ్వండని తెలిపారు. పార్టీ ఆలోచన.. అధికారుల పని తీరు మాకు తెలుసునని, ప్రజలను కన్ఫ్యూజ్ చేయకండని అన్నారు. కుల గణన మొదటి సారి చేసింది. దానికి న్యాయం జరగడానికి ఉపయోగించుకుందాం అని అన్నారు. అటు బలహీన వర్గాల ప్రస్తావనలో మంత్రి మాట్లాడుతూ, ఆయన ఎప్పుడైనా బీసీ సంఘాల నేతలతో సమావేశం చేసుకుని, వారికి న్యాయం అందించే చర్యలు తీసుకోవాలని తెలిపారు. మా ఆలోచన, బలహీన వర్గాలకు న్యాయంచేయడమే అని ఆయన అన్నారు.