TELANGANA

కేటీఆర్ పై నెటిజన్లు ప్రశంసలు..

మంత్రి కేటీఆర్ ఎప్పుడూ ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటారనే విషయం మనందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే రాజకీయ నాయకులలో మంత్రి కేటీఆర్ అందరికంటే ముందు వరుసలో ఉంటారని చెబుతూ ఉంటారు. అయితే.. కేటీఆర్ ఇరవై సంవత్సరాల్లో తను దిగిన ఫోటోను.. ఇప్పటి ఫోటోను జత చేస్తూ షేర్‌ చేశారు. 2010 లో బ్లాక్‌ టీషర్ట్‌ వేసుకుని ఉన్నఫొటోని షేర్ చేశారు.

ఈ ఫొటోలో కేటీఆర్ యంగ్‌ హీరోలా ఉన్నాడు. అయితే ఆ ఫోటోకు మరో ఫోటోను కూడా షేర్‌ చేశారు. ఈ ఫోటోను చూసిన యూజర్లు వావ్‌ కేటీఆర్‌ అన్న.. ఎవర్‌ గ్రీన్‌ మీరు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు రామన్న నువ్వు సూపర్‌ అంటూ అప్పటికి ఇప్పటికి ఏమాత్రం మారలేదు నువ్వు యంగ్ హీరోవి అన్నా అంటూ నెటిజన్లు ట్వీట్ లు చేస్తున్నారు.

ట్విట్టర్‌ ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుని ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడంతో పాటు ప్రత్యర్థి పార్టీలకు కౌంటర్లు ఇస్తూ ఉంటారు. రాజకీయ అంశాలకు సంబంధించినవే కాకుండా తన పర్సనల్ ఫొటోలు, విదేశీ టూర్లకు వెళ్లినప్పుడు అక్కడ దిగిన ఫొటోలను కూడా కేటీఆర్ అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.