ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో భాగం గా ముఖ్యమంత్రి కొత్త జిల్లాల్లో పాలన పైన పలు సూచనలు చేసారు. కొత్త జిల్లాల్లో అధికారులకు పూర్తి స్థాయిలో ఉమ్మడి జిల్లాతో సంబంధం లేకుండా అధికారాలు కేటాయించాలని ఆదేశించారు. స్వేచ్ఛగా వారు విధులు నిర్వహించే వెసులుబాటు ఉండాలని స్పష్టం చేసారు. ఈ మేరకు సంబం ధిత ఆదేశాలను హెచ్‌ఓడీలు రెండు రోజుల్లో జారీ చేయాలని ఆదేశించారు.
కొత్త జిల్లాల్లో
ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త జిల్లాల్లో పాలనా వ్యవహారాల పైన కీలక ఆదేశాలు జారీ చేసారు. కలెక్టర్లు కొత్త జిల్లాల్లో స్వేచ్ఛగా విధులు నిర్వహించే వెసులుబాటు కల్పించాలని సూచించారు. ఈ మేరకు అన్ని శాఖల ప్రధాన కార్యదర్శులు పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేయాలని నిర్దేశించారు. కలెక్టర్ల సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి కొత్త జిల్లాల్లో పాలన పైన చర్చించారు. కొత్త జిల్లాలలో ఎటువంటి స్టాఫ్ సమస్య లేకుండా స్టాఫ్ రెగ్యులేషన్ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పని ఒత్తిడికి తగ్గట్టుగా అధికారులు, సిబ్బందిని కేటాయించాలని వెల్లడించారు. ప్రతి జిల్లా హెడ్‌క్వార్టర్‌లోనూ ప్రత్యేకించి కొత్త జిల్లాల హెడ్ క్వార్టర్లలో కనీసం మూడు హోటల్స్ ఉండేలా చూడాలన్నారు.
అయిదు జోన్లలో
కొత్త జిల్లాల్లో మౌలిక వసతుల కల్పన అంశంపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేసారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా జిల్లా అభివృద్ధి ప్రణాళికలపై రాష్ట్రస్థాయిలో చర్చిస్తున్నామని సీఎం అన్నారు. పేదరిక నిర్మూలనకు సంపదను సృష్టించే టూరిజం తదితర అంశాలకే భవిష్యత్తు అంతా ప్రాధాన్యత ఇస్తుందని, భౌతిక వాదమే వస్తుందని.. తాను చెప్పేది జిల్లా కలెక్టర్లు అందరూ అర్థం చేస్తుకుని క్షేత్ర స్థాయిలో రియల్ టైమ్ లో అమలుపరిస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. ఏపీలో ఐదు జోన్‌లు ఉన్నాయ న్నారు. జోన్-1 లో విశాఖపట్నం, జోన్-2 లో రాజమండ్రి, జోన్-3 లో రాజధాని అమరావతి, జోన్-4 లో తిరుపతి, జోన్-5 లో అనంతపురం పవర్ హబ్‌లుగా ఉన్నాయని చంద్రబాబు వివరించారు.
ఇంచార్జ్ లతో కలిసి
ఆ పవర్ హబ్ల ఆధారంగా ఆయా జోన్లలోని అన్ని జిల్లాలను అభివృద్ది పర్చే విధంగా జిల్లా కలెక్టర్లు జిల్లా అభివృద్ది ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తే రాష్ట్ర భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉంటుందని వెల్లడించారు. ప్రతి ఒక్క జోన్‌కు ఒక సీనియర్ అధికారిని ఇంచార్జిగా ఉంచామని వివరించారు. ప్రతి జిల్లాకు ఇన్‌చార్జి మంత్రి కూడా ఉన్నారని తెలిపారు. వీరందరూ కలిసి ఆయ న జిల్లాలను, ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలో సమగ్రంగా చర్చించి క్షేత్ర స్థాయిలో తగు చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. సీనియర్ అధికారులు అంతా గ్రామాల్లో మూడు నాలుగు రోజులు పర్యటించాలని చంద్రబాబు వెల్లడించారు.