APTELANGANA

వాళ్లకు చచ్చినా టికెట్స్ ఇచ్చేది లేదు.. కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టం.. కారణం అదేనా?

ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల హడావుడి మొదలైంది. ఇంకో మూడు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయి. అందుకే ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి.

అధికార బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే అభ్యర్థుల లిస్ట్ ప్రకటించనుంది. కాంగ్రెస్ కూడా అభ్యర్థులను ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అయితే.. తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్లు ఎక్కువ. సీనియర్ నేతలు కొన్ని నియోజకవర్గాల్లో తమకు నచ్చిన నేతలకే టికెట్లు ఇవ్వాలని ఏకంగా ఢిల్లీకి వెళ్లి మరీ అధిష్ఠానానికి మొర పెట్టుకుంటున్నారు. టికెట్ల విషయంలో హైకమాండ్ కూడా చాలా క్లారిటీతో ఉంది. వాళ్లు వచ్చి రిక్వెస్ట్ చేయడం, వీళ్లు వచ్చి రిక్వెస్ట్ చేయడం కాదు.. అధిష్ఠానం ఒక విధానాన్ని ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది.

ఎలాంటి పైరవీలు.. ఎవరి దగ్గర్నుంచి వచ్చినా కూడా వాటిని సహించేది లేదని కాంగ్రెస్ హైకమాండ్ చెప్పకనే చెప్పినట్టు తెలుస్తోంది. అందుకే.. అధిష్ఠానానికి నమ్మకస్తుడిగా ఉన్న మురళీధరన్ ను తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల స్క్రీనింగ్ కమిటీకి చైర్మన్ గా నిర్ణయించారు. ఆ కమిటీనే అభ్యర్థులను నిర్ణయించనుంది. ఎవరికి పడితే వారికి బీఫారాలు ఇవ్వకూడదని.. ఎవ్వరు చెప్పినా కూడా టికెట్లు ఇచ్చేది లేదని స్క్రీనింగ్ కమిటీకి హైకమాండ్ తేల్చి చెప్పింది. దీంతో అభ్యర్థుల విషయంలో ఈసారి అధిష్ఠానం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది.

 

కర్ణాటకలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన విషయం తెలిసిందే. అయినా కూడా కర్ణాటకలో సీనియర్ల మాట విని కొందరికి టికెట్లు ఇచ్చింది హైకమాండ్. దీంతో వాళ్లలో చాలామంది ఓటమి పాలయ్యారు. అందుకే.. అలాంటి మిస్టేక్ తెలంగాణలో కాకూడదని.. కాంగ్రెస్ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాంటి సిఫారసు లేదు.. ఎవరు రెకమెండ్ చేసినా టికెట్ ఇచ్చేది లేదు. ప్రజాబలం ఉన్న నేతలను చూసి మాత్రమే బీఫారాలు ఇచ్చేందుకు స్క్రీనింగ్ కమిటీ కూడా సిద్ధం అవుతోంది. ఎలాంటి పైరవీలకు తావు లేకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కొందరు సీనియర్ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది.

.