TELANGANA

జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం..!

తెలంగాణ ప్రభుత్వం జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేసింది. రాష్ట్రంలో 31 జెడ్పీ స్థానాలు, 566 ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా 5,773 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయని పేర్కొంది. అదేవిధంగా, 12,778 గ్రామ పంచాయతీలు, 1.12 లక్షల వార్డులు ఉన్నట్లు తెలిపింది.

 

ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో ప్రభుత్వం జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ స్థానాలను ఖరారు చేసింది. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల కాలపరిమితి గత ఏడాది ప్రారంభంలో ముగిసింది.