CINEMA

సమంత పెళ్లిపై మేకప్ స్టైలిస్ట్, పూనమ్ కౌర్ సంచలన పోస్ట్‌లు

నటి సమంత దర్శకుడు రాజ్ నిడిమోరును కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్ – లింగ భైరవి ఆలయంలో భూత శుద్ధి పద్ధతిలో వివాహం చేసుకున్న తర్వాత, సోషల్ మీడియాలో శుభాకాంక్షలతో పాటు విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఈ వివాదాలకు ముఖ్య కారణం సమంత పర్సనల్ మేకప్ స్టైలిస్ట్ సద్నా సింగ్ మరియు నటి పూనమ్ కౌర్ చేసిన పోస్ట్‌లు.

సమంత పెళ్లి తర్వాత ఆమెను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసిన సద్నా సింగ్, తన స్టోరీలో “బాధితురాలిగా… విలన్ చాలా బాగా నటించింది” అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. “సమంత-చైతూ బ్రేకప్‌కు సంబంధించిన ఏదైనా నిజం సద్నా చెప్పిందా?” అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోయారు. సద్నా ఆ తర్వాత “నిన్నటి నుంచి నా ఎగ్జాక్ట్ రియాక్షన్ ఇదే” అంటూ మరో వీడియోను షేర్ చేయడంతో చర్చ మరింత హీటెక్కింది.

సమంత పెళ్లి వార్త బయటకు రాగానే నటి పూనమ్ కౌర్ కూడా కాంట్రవర్సీ ట్వీట్ చేశారు. “సొంత గూడు కట్టుకోవడానికి మరొకరి ఇంటిని పడగొట్టడం బాధాకరం” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇన్‌డైరెక్ట్‌గా సమంతను ఉద్దేశించినవేనని నెటిజన్లు భావించారు. అంతేకాకుండా, “ఈ అహంకారపూరిత మహిళల్ని పేడ్ పీఆర్ గొప్పగా చూపిస్తుంది. బలహీనమైన, నిరాశ చెందిన పురుషులను డబ్బుతో కొనవచ్చు” అని ఆమె మరో పోస్ట్‌లో రాయడంతో సోషల్ మీడియాలో ఈ చర్చ మరింత పెద్దదైంది.