CINEMA

బిగ్ బాస్ ఫేం సొహైల్‌కి తప్పిన ప్రాణాపాయం.!

లోకల్ బాయ్ నాని అంటే చాలామందికి సుపరిచితుడే. యూ ట్యూబ్ వీడియోలు చేస్తుంటాడు. వైజాగ్‌లో వుంటాడు. నడి సంద్రంలో చేపలు పట్టే ప్రక్రియ సహా పలు అంశాలపై వీడియోలు చేసి యూ ట్యూబ్‌లో విడుదల చేస్తుంటాడు లోకల్ బాయ్ నాని. ఆ లోకల్ బాయ్ నానితో బిగ్ బాస్ రియాల్టీ షో ఫేం సొహైల్ కూడా సముద్రంలో హంగామా చేద్దామనుకున్నాడు. సముద్రంలో వ్యవహారమంటే ఆషామాషీ కాదు కదా.! ‘ఇచ్చి పడేస్తా’ అంటే కుదరదక్కడ. ప్రమాదవశాత్తూ సోహైల్ బోటు నుంచి జారిపడ్డాడు.

మెరుపులా స్పందించి కాపాడిన లోకల్ బాయ్.. సముద్రంలో సోహైల్ పడిపోగానే.. మెరుపులా స్పందించాడు లోకల్ బాయ్ నాని. తానూ సముద్రంలోకి దూకేసి, వెంటనే సోహైల్‌ని బయటకు తీశాడు. దాంతో, సోహైల్‌కి ప్రాణాపాయం తప్పినట్లయ్యింది. సోహైల్‌కి ఓ మోస్తరుగా గాయాలయ్యాయి. రక్తం కూడా కారింది. ఈ మొత్తం వ్యవహారాన్ని లోకల్ బాయ్ నాని తాజాగా అప్‌లోడ్ చేసిన వీడియోలో చూపించాడు. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలి సోహైల్.. అన్ని చోట్లా అతి చేస్తానంటే కుదరదంటూ నెటిజన్లు సోహైల్‌ని ఆడుకుంటున్నారు.