శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో రెండు రోజుల ఇస్తిమా(సామూహిక ప్రార్థనలు), భారీగా తరలివచ్చిన ముస్లిం సోదరులు.
ఇస్లాం పాటించే వారంతా విశ్వాసంతో అల్లాహ్ ను ప్రార్దించాలని, విశ్వాసమే ఇస్లాంకు గీటురాయి అని ముస్లిం మతపెద్దలు పేర్కొన్నారు.
కదిరి పట్టణంలోని నూతన బైపాస్ రోడ్డు పక్కన శనివారం మధ్యాహ్నం నుంచి ఇస్తెమా ప్రారంభమైంది. పలువురు ముస్లిం మత
పెద్దలు బయాన్ (ప్రసంగాలు) చేశారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి సందేశం ఇచ్చారు. ప్రతి ఒక్కరూ అల్లాహ్ పై విశ్వాసం కలిగి ఉండాలని సూచించారు.
ఈ ఇస్తెమాలో సామూహిక ప్రార్థనల్లో పాల్గొనేందుకు భారీగా హాజరైన ముస్లింలు
అల్లాహ్ పై నమ్మకంతో ముస్లింలు రోజూ 5 పూటల నమాజ్ చదవాలన్నారు. ముఖ్యంగా దానగుణాలు కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఇస్తెమాకు అనంతపురం, సత్యసాయి, కడప, చిత్తూరు జిల్లాల నుంచే కాకుండా, కర్ణాటక రాష్ట్రం నుంచి సైతం పెద్ద ఎత్తున ముస్లింలు తరలివచ్చారు. ఏపీమెప్మా, సిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. అలాగే పలువురు దాతలు మంచినీరు, తేనీటి వసతి కల్పించారు.

