సంక్రాంతి సందర్భంగా నిర్వహించనున్న క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొననున్న శ్రీ సత్యసాయి జిల్లా, నంబులపూలకుంట మండలం గౌకనపల్లి గ్రామ యువతకు బిజెపి నాయకులు, కదిరి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ షేక్ సమివుల్లా రూ.15,000 విలువ చేసే రెండు క్రికెట్ కిట్లను బుధవారం అందజేశారు.
క్రికెట్ కిట్ల కోసం గౌకనపల్లి యువత చేసిన విజ్ఞప్తికి వెంటనే స్పందించిన షేక్ సమివుల్లా, క్రీడల ద్వారా యువత శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణను అలవర్చుకోవాలని సూచించారు. గౌకనపల్లి గ్రామానికి, నంబులపూలకుంట మండలానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చే విధంగా యువత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. యువత అభివృద్ధికి తనవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జల్లా రామగంగి రెడ్డి గారు, ఎన్డీయే నాయకులు తేలూరి పెద్ద బయన్న గారు, పీరా సాబ్ గారు, అల్లాబకష్ గారు, షేక్ షబ్బీర్ గారు, మొగల్ షమీవుల్లా గారు, యం. రామాంజనేయులు రెడ్డి గారు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

