కదిరి టౌన్, నిజాం వలి కాలనీలో ఉమ్మర్ మసీద్ వద్ద నివాసం ఉండు షేక్ షాహీదా, భర్త బాబజాన్ అను ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు, తాను, తన పిల్లలు గత వారం రోజుల క్రితము హైదరాబాద్ లో ఉన్న వారి అమ్మగారు ఇంటికి వెళ్ళి ఈ రోజు ఉదయము కదిరికి వచ్చి చూడగా, గుర్తు తెలియని వ్యక్తులు వారింటికి తాళాలు పగలగొట్టి, బీరువాలో ఉన్న 42 వేల రూపాయల నగదు, మరియు 1 ½ గ్రాముల బంగారు ఉంగరం దొంగలించారని ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది.
అలాగే గత రాత్రి నిజాం వలి కాలనిలో దొంగతనం సంబంధించిన CCTV ఫుటేజ్ మరియు ఫోటో లు గ్రూప్ నందు పెట్టడం జరిగింది. ఆ వ్యక్తి సమాచారం ఎవరికైనా తెలిసినట్టు అయితే పోలీస్ లకు తెలియ చేయవలెను విజ్ఞప్తి చేయడమైనది.
ముఖ్య గమనిక:- కదిరి టౌన్ నందు గత కొద్ది రోజులుగా తాళం వేసిన ఇళ్లను దొంగలు ప్రధాన టార్గెట్ గా ఎంచుకొని దొంగతనాలు చేయడం జరుగుతున్నది. ఈ విషయములో ప్రజలకు తెలియ చేయడము ఏమనగా, వ్యక్తిగత పనుల మీద బయటికి వెళ్ళినప్పుడు, ఇంటిలో ఎటువంటి బంగారు, వెండి, డబ్బులు మరియు ఇతర విలువైన వస్తువులు ఇంటిలో ఉంచుకుండా, బ్యాంక్ లాకర్ ల నందు, లేదా నమ్మకమైన వ్యక్తుల వద్ద ఉంచడం గానీ చేయవలెను అని, కొత్త వ్యక్తులు మీ పరిసరాలలో అనుమానస్పదముగా తిరుగుతూ ఉన్నట్టు కనిపిస్తే పోలీస్ లకు డయల్ 100 ద్వారా గాని, నేరుగా గాని సమాచారం తెలియ చేయాలని విజ్ఞప్తి చేయడమైనది.
ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్
కదిరి టౌన్ పియస్.

