కదిరిలో అడుగు భూమి కూడా కబ్జా కానివ్వం కదిరిని కబ్జాల నుండి కాపాడుతాం , అక్రమ లేఔట్లను ఎక్కడ ఉపేక్షించం వాటిని తొలగిస్తాం కదిరి పరిరక్షిస్తాం అని చెప్పే ప్రజాప్రతినిధులు కదిరి నడిబొడ్డున వందల కోట్ల రూపాయలు విలువచేసే భూములు లేఅవుట్లుగా మారుతున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
కదిరిలో 100 కోట్ల భూ వ్యవహారంపై కదిరి వైయస్సార్సీపి సమన్వయకర్త బిఎస్ మక్బుల్ స్పందించారు. రికార్డులు పరంగా పరిశీలిస్తే ఆ భూమి ముస్లింలు దేనిని వారు లేకపోవడంతో కొందరు తప్పుడు పత్రాలతో వాటిని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారని ఇప్పటికే ఆ భూమిలో ముస్లిం పెద్దల సమాధులను సైతం ధ్వంసం చేసి లేఅవుట్లు సిద్ధం చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో భూకబ్జాలు అధిక అధికమైపోయాయని విమర్శించారు. పట్టణ నడిబొడ్డున ఇంత జరుగుతున్న మున్సిపల్ రెవిన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు. ఈ భూమికి సంబంధించి కోర్టులో వ్యవహారం నడుస్తున్నందున ప్రజలు ఎవరు వాటిని కొనుక్కోవద్దని ఆయన సూచించారు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిపై చర్యలు తప్పక ఉంటాయని అందుకు అధికారులంతా సమాధానం చెప్పవలసి వస్తుందని హెచ్చరించారు.

