AP

కదిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ కె. రమ పదవీ విరమణ

కదిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి కే రమా గారు పదవి విరమణ చెందారు
స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కదిరి ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న శ్రీమతి కే రమా గారు ఈ రోజు అనగా 31-01-2026 న పదవి విరమణ పొందినారు. కె రమా గారు 1989లో అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అసోసియేట్ లెక్చరర్ గా విధుల్లో చేరారు.అప్పటి నుంచి ఎన్నో వేలమంది విద్యార్థులు ను ఉన్నత స్థానాలకు తీర్చి దిద్ది వారి అభ్యున్నతికి కు కృషి చేశారు.వివిధ హోదాలలో పని చేసి తోటి అధ్యాపకుల మన్ననలు లు పొంది మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కదిరి ప్రిన్సిపల్ గా 2024 లో చేరి అప్పటి నుంచి కళాశాల అభివృధ్ది కి అహర్నిశలు కృషి కళాశాల కు మంచి గుర్తింపు తీసుకువచ్చారు.వారి తండ్రి గారు అయిన రామయ్య గారు కూడా ఇదే శాఖ లో గణిత అధ్యాపకుల గా పని చేసి 1992లో శ్రీశైలం లో పదవి విరమణ పొందారు. ఇప్పటి నుంచి కళాశాల ప్రిన్సిపల్ ఇంచార్జి గా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగ అధిపతి అయిన పి. భాస్కర్ గారు విధి నిర్వర్తిస్తారు.