AP

పిఠాపురంలో బిగ్ టర్న్ – పవన్ Vs మాజీ ఎమ్మెల్యే వర్మ, గెలిచేదెవరు..!

ఎన్నికల రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. పవన్ కల్యాణ్ పోటీ పైన ప్రకటన చేసారు. తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో, ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసాయి. పిఠాపురం టీడీపీ ఇంఛార్జ్ వర్మ అనుచరులు పార్టీ జెండాలను, ఫ్లెక్సీలను దగ్గం చేసారు. వర్మ స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. రేపు వర్మ తన మద్దతుదారులతో భేటీ ఏర్పాటు చేసారు. కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు.

 

మారుతున్న లెక్కలు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో..ఇప్పటి వరకు ఎన్నికల్లో పోటీకి సిద్దమవుతున్న నియోకవర్గ టీడీపీ ఇంఛార్జ్ వర్మ వర్గం మండిపడుతోంది. పవన్ ప్రకటనకు నిరసనగా ఆందోళనకు దిగారు. ఒక్కసారిగా అసంతృప్తి సెగలు బయట పడ్డాయి.

 

పార్టీ జెండాలను ఫ్లెక్సీలను నిప్పు పెట్టి తగలబెడుతున్న టిడిపి కార్యకర్తలు..వర్మకు అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు టిడిపి కార్యకర్తలు సిద్దమవుతున్నారు. దీంతో, వర్మ కీలక ప్రకటన చేసారు. తాను శుక్రవారం తన మద్దతుదారులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో అందరూ ఎలా నిర్ణయిస్తే అలా నడుచుకుంటానని స్పష్టం చేసారు.

 

వర్మ సహకరిస్తారా 2014 ఎన్నికల సమయంలోనూ వర్మ ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నారు. ఇంఛార్జ్ గా ఉన్న వర్మను కాదని నాడు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్దిగా టీడీపీ నుంచి పీవీ విశ్వం అనే అభ్యర్దిని బరిలోకి దింపారు. ఆ ఎన్నికల్లో వర్మ స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో వర్మ ఏకంగా 47 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇప్పుడు సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. చేసారు.ప్రజారాజ్యం 2009లో పిఠాపురం సీటు గెలుచుకుంది.

 

ప్రజారాజ్యం ఎమ్మెల్యేగా ప్రస్తుత వైసీపీ ఎంపీ వంగా గీత గెలిచారు. ఇప్పుడు వైసీపీ పిఠాపురం బాధ్యతలను వంగా గీతకు అప్పగించారు. గీత ఇప్పటికే అక్కడ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఇదే సమయంలో టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వర్మ సీటు ఆశిస్తున్నారు. కొద్ది రోజులుగా స్థానికులే ముద్దు వంట నినాదాలతో అక్కడ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి.

 

రేపే కీలకం పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసినా..అక్కడ వర్మ పాత్ర కీలకంగా మారనుంది. ఇప్పుడు పవన్ పోటీకి దిగుతున్న సమయంలో తన మద్దతు దారుల సమావేశంలో వర్మ ఎలాంటి నిర్ణయం తీసు కుంటారనేది స్పష్టత రావాల్సి ఉంది. అటు వంగా గీత గతంలో ప్రజారాజ్యం ఎమ్మెల్యేగా గెలిచి ఉండటం..ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా పని చేస్తుండటంతో అక్కడ పట్టు పెంచుకొనే ప్రయత్నం చేసారు.

 

అయితే, అనూహ్యంగా పవన్ కల్యాణ్ పోటీ ప్రకటన చేసిన వెంటనే టీడీపీ మద్దతు దారులు చేస్తున్న ఆందోళనతో ఇప్పుడు వర్మను బుజ్జగించేందుకు చంద్రబాబు ఏం చేస్తారు..ఎలాంటి హామీ ఇస్తారనేది కీలకంగా మారుతోంది. దీంతో, పిఠాపురం రాజకీయం పైన శుక్రవారం స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది