- ప్రజా సమస్యల పరిష్కారమే మన ప్రభుత్వ ధ్యేయం!
- కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్
సత్య సాయి జిల్లా
కదిరి నియోజవర్గం
ఈరోజు కదిరి పట్టణం మున్సిపల్ 10,11 వార్డుల సంబంధించిన ‘ప్రజా దర్బార్’ రాయచోటి రోడ్డు సిరి కల్చర్ ఆఫీస్ లో నిర్వహించడం జరిగింది. అర్జీలు ఇవ్వడానికి వచ్చిన ప్రజలను కలిసి, వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నాను.
ప్రజలు సమర్పించిన వినతులను క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి మెజారిటీ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం జరిగింది.
దీర్ఘకాలిక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించాను.
ప్రజల చెంతకే పాలనను తీసుకువెళ్లడమే లక్ష్యంగా, ప్రతి ఒక్కరి సమస్యకు పరిష్కారం చూపే వరకు నా కృషి కొనసాగుతుంది.
#kandikuntavenkataprasad #PrajaDarbar
#PublicService
#IdhiManchiPrabhutvam
#AndhraPradesh

