AP

ఉత్ఖంఠ క్రికెట్ పోటీలో కోచింగ్ క్యాంపు B జట్టు విజయం.

ఈరోజు డిగ్రీ కళాశాల మైదానం నందు జరిగిన క్రికెట్ పోటీలో మొదట బ్యాటింగ్ చేసిన కోచింగ్ క్యాంపు A జట్టు 25 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేశారు. మొహమ్మద్ 45 దేవేంద్ర 25 ప్రణయ్ 25 not అవుట్ రాణించారు. బౌలర్లు శివాజీ 2 తేజు, సన్నీ చెరో వికెట్ తీశారు. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన B జట్టు చివరి ఓవర్ చివరి బంతికి 4 పరుగులు అవసరం కాగ సాదిక్ ( 49 not అవుట్ ) గెలిపించాడు.అఖిల్, తేజు చెరో 21 పరుగులతో సహకారం అందించారు.అజమల్ 3, బాలాజీ, యుక్తి చెరో రెండు వికెట్లు తీశారు.

ఈ మ్యాచ్ కు ముఖ్య అతిధి గా 35 వ వార్డ్ TDP నాయకులు, టీడీపీ మీడియా కోఆర్డినేటర్ ఏసిపి చౌదరి గారు విచ్చేసి టాస్ వేసి మ్యాచ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఇటీవల క్రికెట్ నెట్స్ రోడ్ నందు తన సొంత నిధులతో వీధి దీపాలు ఏర్పాటు చేసినందుకు చౌదరి గారిని ప్లేయర్స్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు సత్కరించి కృతజ్ఞతలు తెలియచేసారు…
ధన్యవాదములు
విధేయుడు
నజీర్. క్రికెట్ కోచ్