ఇన్‌స్టాగ్రామ్‌పై ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వేదిక కేవలం అమ్మాయిల కోసమేనంటూ సోషల్ మీడియాలో రచ్చకు దారితీశారు.
సోషల్ మీడియాలో ప్రజల అలవాట్లు, వారి జీవితంలోని వివిధ దశలు ఎలా ప్రతిబింబిస్తాయనే అంశంపై ఓ వైరల్ థ్రెడ్ నడుస్తోంది. అందులో ఫొటోలు పెట్టడం, రీల్స్ చేయడం, వంట ఫొటోలు షేర్ చేయడం వంటి పనులపై జోకులు పేలాయి. ఈ చర్చలోకి ఎంటర్ అయిన మస్క్.. ఇన్స్టాగ్రామ్ అమ్మాయిల కోసమే అంటూ కామెంట్ చేశారు. అంతటితో ఆగకుండా ‘‘కొంతమంది మగవాళ్లు తమ ఇన్‌స్టా ప్రొఫైల్స్ నాకు పంపుతూ ఉంటారు. వాళ్లేమైనా లింగమార్పిడి చేయించుకుంటున్నారా’’ అనిపిస్తుంది అంటూ వివాదానికి తెరతీశారు. దీంతో ఆయనపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
మస్క్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారేం కాదు. ఆయనకు సోషల్ మీడియాలో యూజర్లను రెచ్చగొట్టడం (రేజ్ బైటింగ్) బాగా అలవాటు. అలాగే లింగమార్పిడిపైనా ఆయనకు కొన్ని కచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. అయితే తన ‘ఎక్స్’ ప్లాట్‌ఫామ్‌ను ప్రమోట్ చేసుకోవడంలో భాగంగానే ఆయన ఇన్‌స్టాపై అక్కసు వెళ్లగక్కుతారనే విమర్శలు ఉన్నాయి

