*ఎర్రగుంట స్కూల్లో స్పోర్ట్స్ కిట్టు పంపిణీ*
(కనేకల్ డేట్ లైన్)
కనేకల్ మండలం ఎర్రగుంట ప్రభుత్వ పాఠశాలలో రేసోనియా కంపెనీ ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలకు స్పోర్ట్స్ కిట్టు పంపిణీ బుధవారం జరిగింది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే ఒక్కచదువుతో సమాజం పట్ల అవగాహన పెరుగుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు…కణేకల్లు మండలంలోని ఎర్రగుంట జిల్లా పరిషత్ వున్నత పాఠశాలలో రెజోనియా కంపెనీ విద్యార్థులకు క్రీడా సామాగ్రి అందచేశారు…ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ మండలకన్వినర్ వన్నారెడ్డి హాజరయ్యారు..ఆయనతోపాటు రెజోనియా కంపెనీ మేనేజర్ వినోద్ కంపెనీ ప్రతినిధులు కృతికలక్ష్మి ,నగేష్ ,హైస్కూల్ ప్రధానాపాధ్యాయులు రాజశేఖర్, మాధవ్ పురుషోత్తం ,పీ ఈటీ నరసింహులు, తదితరులు పాల్గొన్నారు…ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు క్రికెట్ వాలీబాల్,, చెస్ క్వారమ్స్ ఫుట్ బాల్ , షార్ట్ ఫుట్ తదితర క్రీడా సామాగ్రీ అందచేశారు…జడ్పీ ఉన్నత పాఠశాలలో క్రీడామైదానం వున్నప్పటికీ క్రీడా సామాగ్రీ లేకపోవడంతో ఇబ్బందులుండేవని అయితే రెసోనియా కంపెనీ గుర్తించి క్రీడాసామాగ్రీ అెందచేయడం పట్ల అద్యాపకబృందం కృతజ్ఞతలు తెలిపారు..అందుకు సహకరించిన మండలటీడీపీ కన్వినర్ వన్నారెడ్డికి వుపాధ్యాయులు కృజజ్ఞతలు తెలిపారు….రెసోనియా కంపెనీ వినోద్ మాట్లాడుతూ తమ కంపెనీ ఇప్పటికే పలు ప్రాంతాల్లో సేవాక్రమాలు చేపట్టిందన్నారు…వెనుకబడినప్రాంతాల్లో తమవంతు సేవగా వివిధసేవాకారక్రమాలు చేపట్టడం జరుగుతోందన్నారు..

