AP

ప్రశ్న రావణ్‌-వైసీపీ గుట్టు విప్పిన సీఎం చంద్రబాబు..!

యూట్యూబర్ ప్రశ్న రావణ్ వెనుక వైసీపీ ఉందని తేల్చేశారు సీఎం చంద్రబాబు. ఆయనకు వైసీపీ ఆర్థికసాయం చేసిందని కీలక వ్యాఖ్యలు చేశారు. పురాణాలు, రాముడు, సీతపై నీచంగా మాట్లాడిన రావణ్ కు గొడ్డలిపార్టీ ఆర్థికసాయం చేసిందన్నారు. రాష్ట్రంలో వింత ప్రవర్తన కలిగిన కొందరు వ్యక్తులు ఉన్నారని విమర్శించారు.

 

వైసీపీ-రావణ్ గుట్టు విప్పిన సీఎం చంద్రబాబు- గురువారం నంద్యాల జిల్లా బనగానపల్లెలో ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడారు. రౌడీలు-సంఘ విద్రోహ శక్తులను ఎవరు ప్రోత్సహించవద్దని కోరారు. కుల-మతాలను విభజించడానికి వీల్లేదని, ఆస్తి కోసం తల్లిని హింసిస్తున్నారని కొత్త విషయాలు బయటపెట్టారు.

 

బనగానపల్లె సభలో సీఎం- ఓట్ల కోసం చనిపోయిన తండ్రికి పూజలు చేస్తున్నారని, తల్లిని గౌరవించలేని వ్యక్తి మనకు అవసరమా అంటూ ప్రశ్నించారు. తల్లులంటే గౌరవం ఉండాలని, తల్లికి వందనం తీసుకొచ్చామన్నారు. కుట్రలు, కుతంత్రాలు చేస్తోందని, కులం, మతం, ప్రాంతాల వారీగా ముక్కలు చేసే కుట్రకు పాల్పడుతోందని దుయ్యబట్టారు.

 

హే రామ్ అంటూ జగన్ కొత్త డ్రామాలు- సీమలో ముఠాలు లేకుండా టీడీపీ చేసిందని, ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. ఆడబిడ్డలు స్వేచ్ఛగా తిరగాలని, మత విద్వేషాలు రెచ్చగొట్టడం, మనోభావాలు దెబ్బ తీయడం మంచిదికాదన్నారు. ఆడబిడ్డల జోలికి వస్తే వారికి అదే చివరి రోజు అవుతుందని మళ్లీ మళ్లీ హెచ్చరించారు.

 

వీరబ్రహ్మేంద్రస్వామి ఆనాడే చెప్పారు- తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే వేరే మతస్తులు డిక్లరేషన్ ఇవ్వాలనే నియమం ఉందని, అది ఇవ్వకుండా హే రామ్ అంటూ జగన్ వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు. ఇలాంటి వాళ్లను ఏమనాలని ప్రశ్నించారు. కాలజ్ఞానం రాసిన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి తిరిగిన స్థలమని, కలియుగంలో ఇలాంటి వింతలు జరుగుతాయని ఆనాడే చెప్పారన్నారు.

 

వైసీపీలో హయాంలో చేసిన కుతంత్రాలను బయటపెట్టారు సీఎం చంద్రబాబు. వీరి హయాంలో అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభించి, ఎన్జీటీ స్టే ఇస్తే పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఇప్పుడు తనపై విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.

 

రాయలసీమ తన సొంత గడ్డ అని, అలాంటి ప్రాంతానికి అన్యాయం జరగనివ్వనని తేల్చేశారు. ఈ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్ గా మార్చబోతున్నట్లు చెప్పుకొచ్చారు. అంతకుముందు రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేశారు ముఖ్యమంత్రి.