AP

సజ్జల నాపై దాడి చేశారు..! వైసీపీకి విజయసాయిరెడ్డి సంచలన లేఖ..!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఏంపీ విజయసాయిరెడ్డి విడుదల చేసిన లేఖ ఇప్పడు ఏపీ వ్యాప్తంగా కలకలం రేపుతుంది. వైఎస్సార్‌సీపీకి, రాజ్యసభ పదవికి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తరువాత ఇప్పటివరకు మాట్లాడని సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్షలు గుప్పించారు...

గత 02022లో జరిగిన వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాల సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి తనపై భౌతికంగా దాడి చేసారని విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ ఘటనగురించి జగన్‌కు తెలిసినప్పటికీ జగన్ స్పందించకుండా ఉన్నారని వాపోయారు. వైఎస్సార్‌సీపీ పార్టీలో ఇప్పటివరకు దాదాపుగా నాపై 74 అవమానాలను ఏదుర్కోన్నారని విజయ సాయిరెడ్డి తెలిపారు. దీంతో నా ఆత్మగౌరవాన్ని చంపుకొని పార్టీలో పనిచేయలేకనే నా రాజ్యసభ పదవికి రాజీనామా చేసానని స్ఫష్టం చేశారు.

ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ పార్టీలో జగన్ చుట్టూ ఓ వర్గం ఏర్పాటైందని, దీంతో పార్టీలో మొదటి స్థానంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటే తరువాతనే జగన్ ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే సజ్జలకు సాష్టాంగ నమస్కారాలు చేయలేకనే నేను పార్టీలోనుండి బయటకు వచ్చానని విజయ సాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు.