TELANGANA

అసెంబ్లీలో కన్నీళ్లు పెట్టుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్..!

తాతా మధు వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. ఆడబిడ్డలగా మంచిగా మీరు మమ్మల్ని చూసుకుంటారని మంత్రి సీతక్క అన్నారు. లేని తల్లి గురించి అవమానకరంగా మాట్లాడిన తాత మధును వెంటనే సస్పెండ్ చెయాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. ఈ విషయంపై కెసిఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాతా మధు సభ్యత్వం తొలగించాలని అన్నారు. స్పీకర్ పై అనుచిత వాఖ్యల నేపథ్యంలో మంత్రి సీతక్క భావోద్వేగానికి గురయ్యారు. తాతా మదు, నవీన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. లేని తల్లిని గుర్తుచేస్తూ అవమానకరంగా మాట్లాడంతో సీతక్క మాట్లాడుతుండగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎమోషనల్ అయ్యారు..

స్పీకర్ చైర్‌ని స్పీకర్ గౌరవ మర్యాదలకు భంగం కలిగించేవిధంగా తాతా మధు మాట్లాడటం దారుణం అని అన్నారు. లేని తల్లిని గుర్తుచేసి స్పీకర్ ని బాదపెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. స్పీకర్ పై అత్యంత అవమానకరంగా మాట్లాడటం దారునం అని సీతక్క ఎమోషనల్ అయ్యారు. రాష్ట్రంలో బ్యాడ్ లాంగ్వేజ్‌కి బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ ఆయన బీఆర్ఎస్ పార్టీ అని మంత్రి సీతక్క అన్నారు. తెలంగాణ ముసుగులో అనేక తప్పుడు కూతలు కూసిన చరిత్ర కేసీఆర్ ది అని మంత్రి సీతక్క అన్నారు. దళితులంటే వారికి నచ్చదని అందుకే స్పీకర్ గా ఉన్న మిమ్మల్ని చూసి ఓర్వలేక పోతున్నారని అన్నారు.

దళితులంటే వారికి లెక్కలేదు కాబట్టే దొర అహంకారం దురహంకారం మీపై చూపిస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. స్పీకర్ ని తిట్టిన వీడియోస్ అన్నీ తీయించి భాద్యులపై చర్యలు తీసుకోవాలని సీతక్క డిమాండ్ చేశారు. మహిళలపట్ల మీరు గౌరవంగా మాట్లాడే విధానం మాకు తెలుసని అలాంటి మిమ్మల్సి దుర్భాషలాడటం దారునం అని అన్నారు. గతంలో జగదీశ్వర్ రెడ్డి స్పీకర్ పై దారుణంగా మాట్లాడారని గుర్తు చేశారు.