రాజకీయాల్లో యువత కూడా కీలక బాధ్యతలు చేపడుతూ తమదైన ముద్ర వేస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించడమే కాకుండా, ప్రజాప్రతినిధులుగా ముఖ్య పదవులు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఒంగోలుకు చెందిన చావలి చర్పిత ప్రత్యేక గుర్తింపు పొందారు. కార్పొరేటర్‌గా ఎన్నికైన కొద్ది రోజులకే డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు చేపట్టి అందరి దృష్టిని ఆకర్షించారు.
ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్‌గా శ్రీశిల్ప, డిప్యూటీ మేయర్‌గా చర్పిత బాధ్యతలు చేపట్టారు. నగర పాలనా బాధ్యతలు ఇద్దరు మహిళల చేతుల్లో ఉండటం విశేషంగా నిలిచింది. కేవలం 24 ఏళ్ల వయసులో డిప్యూటీ మేయర్ పదవి చేపట్టిన చర్పితకు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
చర్పిత రాజకీయ ప్రస్థానం కూడా ఆసక్తికరంగా సాగింది. ఒంగోలు 27వ డివిజన్ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన ఆమె, ఇంటింటికీ వెళ్లి ఓటర్లను పలకరిస్తూ ప్రచారం నిర్వహించారు. చిరునవ్వుతో ప్రజలతో మమేకం కావడంతో పాటు ప్రచార వీడియోలు, రీల్స్ ద్వారా యువతకు చేరువయ్యారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెకు ప్రత్యేక గుర్తింపు లభించింది.

