మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలలో నటిస్తూ యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈయన నటించిన విశ్వంభర, కాకా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమాలు కాకుండా ఇప్పటికే ఈయన శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో కూడా సినిమా చేయబోతున్నట్లు ఇదివరకు ప్రకటించారు. అయితే తాజాగా చిరంజీవి(Chiranjeevi) మూవీ లిస్టులో మరొక డైరెక్టర్ చేరిపోయారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram srinivas) చిరంజీవిని డైరెక్ట్ చేయబోతున్నట్టు సమాచారం.
ఇండస్ట్రీ సమాచారం ప్రకారం డివివి దానయ్య (dvv danayya)నిర్మాణంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేయబోతున్నారని కాకా సినిమా(Kaa ka) షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయని సమాచారం. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రాబోతుంది. ఇలా కాకా సినిమా తరువాత చిరంజీవి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్నారనే వార్తలు బయటకు రావడంతో ఎన్టీఆర్ అభిమానులు అయోమయంలో పడ్డారు.. త్రివిక్రమ్ శ్రీనివాస్ తదుపరి సినిమా ఎన్టీఆర్ తో ఉండబోతుందని ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్ హీరోగా గాడ్ ఆఫ్ వార్ సినిమా ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ మొత్తం పూర్తి అయ్యిందని, ఎన్టీఆర్ షూటింగ్లో పాల్గొనడమే ఆలస్యం అంటూ చెప్పుకు వచ్చారు కానీ ఇప్పుడు మాత్రం ఈయన చిరంజీవితో సినిమా చేయబోతున్నారనే విషయం తెలియడంతో గాడ్ ఆఫ్ వార్ లేనట్టేనా? అంటూ అభిమానులు భావిస్తున్నారు. ఇటీవల త్రివిక్రమ్ డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆదర్శ కుటుంబం అనుకున్న స్థాయిలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది ఈ నేపథ్యంలోనే గాడ్ ఆఫ్ వార్ సినిమాని ఎన్టీఆర్ హోల్డ్ లో పెట్టారా? అందుకే త్రివిక్రమ్ చిరంజీవితో కమిట్ అయ్యారా అంటూ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.
మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ చిరంజీవి సినిమాల గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలి అంటే చిత్ర బృందం అధికారకంగా స్పందించాల్సి ఉంది. ఇక చిరంజీవి నటించిన విశ్వంభర సినిమా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకులు ముందుకు రాబోతుందని తెలుస్తుంది. నిజానికి జనవరి 13వ తేదీ కాకా సినిమా విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా తప్పుకుంటూ అదే తేదీన విశ్వంభర విడుదల కాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి మేకర్స్ అధికారికంగా వెల్లడించనున్నారు.

