టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు కర్నూలు పర్యటన అనూహ్యంగా విజయవంతం అయింది. ఆయన కోసం జనం పోటెత్తారు. మునుపెన్నడూ లేనివిధంగా ప్రజలు నీరాజనం పట్టారు. లక్షలాది మంది జనం ఎమ్మిగనూరు వద్ద స్వాగతం పలికారు. కర్నూలు లీడర్లు కేఈ, కోట్ల, భూమా, గౌరు ఐక్యంగా చంద్రబాబు వద్ద నిలబడ్డారు. దీంతో ఎన్నికల్లో కర్నూలులో టీడీపీ స్వీప్ అనేంతగా స్పందన లభించిందని ఆ పార్టీ అంచనా వేస్తోంది.
ఇదంతా పైకి కనిపించిన దశ్యం. కానీ, రెండు చేదు అనుభవాలు చంద్రబాబు పర్యటన సందర్భంగా ఆ పార్టీని వెంటాడాయి. విశేషంగా హాజరైన జనాన్ని చూసిన చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. ఇవే చివరి ఎన్నికలంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో గెలిపిస్తే అసెంబ్లీకి వెళతాను. లేదంటే ఏపీని ఆదుకోలేనంటూ కామెంట్లు చేశారు.
కానీ, ఆ వ్యాఖ్యలను వైసీపీ మరో రకంగా ఏపీ సమాజం ముందుకు తీసుకెళ్లడం సంచలనం కలిగిస్తోంది. ఏడాదిన్న ముందే ఓటమిని చంద్రబాబు అంగీకరించారని ఆయన కామెంట్లను మరో కోణం నుంచి తీసుకెళుతున్నారు. కర్నూలు పర్యటనలో ఇదే మైనస్ పాయింట్ గా టీడీపికి నిలిచిపోయింది.