SPORTS

ఇంగ్లీష్ టీం.. సామాజిక మాధ్యమాల్లో దారుణమైన ట్రోలింగ్స్

టీ 20 మ్యాచ్ వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు ఇంగ్లాండ్ టీం కంగారులతో టీ _20 సిరీస్ ఆడింది. అక్టోబర్ 9, 12 తేదీల్లో జరిగిన మ్యాచ్ ల్లో గెలుపొందింది. మూడో మ్యాచ్ ఫలితం తేలలేదు.. 2_0 తేడాతో సిరీస్ గెలుచుకుంది. ఆ తర్వాత అదే ఆస్ట్రేలియాలో ప్రారంభమైన టి20 మెన్స్ వరల్డ్ కప్ లో ఒక్క ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ మినహా అప్రతిహతంగా ఇంగ్లీష్ టీం విజయాలు సాధించింది. మరి ముఖ్యంగా సెమిస్ లో ఇండియాతో జరిగిన మ్యాచ్లో అయితే ఒక వికెట్ కోల్పోకుండా గెలిచిన తీరు అనన్య సామాన్యం. అదే ఊపును ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ తో కొనసాగించింది. వెరసి రెండోసారి సొంతదేశానికి టి20 వరల్డ్ కప్ తీసుకెళ్ళింది. కానీ ఆ తర్వాత ఇంగ్లీష్ టీం ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ ను కోల్పోయింది. అది కూడా 3_0.. క్రికెట్ పరిభాషలో చెప్పాలి అంటే వైట్ వాష్. మొన్ననే కదా ఇంగ్లాండ్ టీ20 సీరిస్ గెలిచింది. అంతలోనే ఈ పరాభవాన్ని మిగిల్చుకుంది.

ఆస్ట్రేలియా కూడా మూడు మ్యాచ్ ల్లో సూపర్ పెర్ఫార్మెన్స్ కనబరిచింది. డేవిడ్ వార్నర్, హెడ్ అయితే పూనకం వచ్చినట్టు బ్యాటింగ్ చేస్తున్నారు. తొలి వికెట్ కు రికార్డు స్థాయిలో భాగస్వామ్యాలను నెలకొల్పుతున్నారు. ఒకప్పటి ఆడం గిల్ క్రిస్ట్, మాథ్యూ హెడెన్ ద్వయాన్ని గుర్తు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా మూడో వన్డేలో వార్నర్, హెడ్ జోడి ఆడిన తీరు న భూతో.. న భవిష్యత్. తొలి వికెట్ కు 269 పరుగుల భాగస్వామ్యం అంటే మామూలు విషయమా? బౌలింగ్ తేలిపోతుంది టి20 వరల్డ్ కప్ సిరీస్ లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన ఇంగ్లీష్ టీం… అదే ఆస్ట్రేలియా పిచ్ లపై తేలిపోతుంది. ధారాళంగా పరుగులు ఇస్తోంది. టి20 సిరీస్ నెగ్గాం. ఇక మాకు చాలు అనే తీరుగా వారి ప్రదర్శన ఉంటోంది. జోర్డాన్, వేయిలీ వంటి బౌలర్లు పదునైన బంతులు వేయలేకపోతున్నారు.

ఈ బౌలర్లే టి20 సిరీస్ లో మెరుగైన ప్రదర్శన చేశారు. ఇంగ్లీష్ టీం సిరీస్ నెగ్గడంలో కీలకపాత్ర పోషించారు. బ్యాట్స్ మెన్ ది కూడా అదే దారి మొదటి వన్డేలో ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ మలన్ వీర విహారం చేశాడు. ఆ తర్వాత జరిగిన రెండు వన్డేల్లో ఏ ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ కూడా ఆ స్థాయిలో ప్రదర్శన చేయలేదు. రాయ్,సాల్ట్, విన్స్, మిల్లింగ్స్, బట్లర్, లియామ్ డాసన్ వంటి బ్యాట్స్మెన్ ఆస్ట్రేలియా బౌలర్లను ప్రతిఘటించలేకపోతున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా బౌలర్ ప్యాట్ కమిన్స్ ఒకప్పటి మెక్ గ్రాత్ ను గుర్తు చేస్తున్నాడు. ఇంగ్లీష్ బౌలర్లు ఆపసోపాలు పడుతున్న వేళ.. అతడు చాలా తేలిగ్గా బౌలింగ్ చేస్తున్నాడు. అంతేకాదు ఇంగ్లీష్ టాపర్డర్ ను పేక మేడలా కూల్చేస్తున్నాడు. సరిగ్గా టి20 సిరీస్ ముగిసి మూడు వారాలు కాలేదు..

విజేతగా నిలిచిన ఇంగ్లీష్ టీం ఇప్పుడు వైట్ వాష్ తో దారుణమైన పరాభవాన్ని మిగులుచుకుంది.. విధిరాత అంటే ఇదేనేమో.. అయితే ఇవాళ జరిగిన మూడో వన్డేలో 200 పై చిలుకు పరుగుల తేడాతో ఓడిపోయిన ఇంగ్లీష్ టీం.. సామాజిక మాధ్యమాల్లో దారుణమైన ట్రోలింగ్స్ కు గురవుతోంది. ఇంగ్లాండ్ టీంకు వన్డే మ్యాచ్లు ఆడటం రాదని, వారు టీ20లకు మాత్రమే పనికొస్తారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ టీం ఎలా t20 సిరీస్ గెలిచిందని జోకులు వేస్తున్నారు. అయితే దీనికి ఇంగ్లీష్ జట్టు అభిమానులు కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీస్తోంది.