రాష్ట్రంలో అంగన్ వాడీ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి ఏపీ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నిబంధనల ప్రకారం పోస్టులు భర్తీ చేయట్లేదంటూ.. నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ గతంలో కొంతమంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం పోస్టుల భర్తీపై స్టే విధించింది. తాజాగా ఆ స్టేను ఎత్తివేస్తూ నిబంధనల ప్రకారం పోస్టుల భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
దీంతో రాష్ట్రంలో దాదాపు 560 అంగన్ వాడీ సూపర్వైజర్ పోస్టులు భర్తీకానున్నాయి. అంగన్వాడీ సూపర్ వైజర్ల పోస్టుల ఎంపికలో అన్యాయం జరిగిందని అభ్యర్ధులు కోర్టును ఆశ్రయించడంతో. అయితే వారి పిటిషన్లను కొట్టివేస్తూ పాత ప్రక్రియను కొనసాగించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. పాత నోటిఫికేషన్ ప్రకారమే అభ్యర్ధులను ఎంపిక చేస్తున్నామని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలియజేశారు. హైకోర్టు తీర్పు ఇవ్వడంతో పలువురు ఆనందం వ్యక్తం చేశారు.