అదానీ గ్రూప్ నిర్మిస్తున్న విజిన్‍జమ్ పోర్టు(Vizhinjam Port) పై కేరళలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ట్రాన్స్ షిప్‍మెంట్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కొందరు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అదుపులోకి తీసుకున్న వారిని విడుదల చేయాలంటూ వేలాది మంది ప్రజలు.. కేరళలోని విజిన్‍జమ్ పోలీస్ స్టేషన్ (Vizhinjam Police Station) ను ముట్టడించారు. కేరళ రాజధాని తిరువనంతపురానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్టేషన్‍పై దాడి చేశారు. దీంతో ఏకంగా 3,000 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. చట్ట విరుద్ధంగా గమికూడడం, అల్లర్లు, నేరపూరితమైన కుట్ర అభియోగాల కింద కేసులు పెట్టారు. అసలు ఏం జరిగిందంటే.. పోలీసులకు గాయాలు Adani Port Protests: విజిన్‍జమ్ పోలీస్ స్టేషన్ ముందు 3,000 మందికి పైగా ప్రజలు ఆందోళన చేశారు. అదానీ పోర్టు నిర్మాణానికి వ్యతిరేకంగా సాగుతున్న నిరనసల్లో భాగంగా ఇది జరిగింది. పోలీసులపై ఆందోళనకారులు దాడి చేశారని తిరువనంతపురం పోలీస్ కమిషనర్ స్పర్జన్ కుమార్ తెలిపారు. ఈ దాడిలో 36 మంది పోలీసులు గాయపడ్డారని, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. ఏకంగా రూ.85లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని చెప్పారు. పోలీస్ స్టేషన్‍పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకునే విషయంలో ఎలాంటి వెనుకడుగు ఉండదని స్పష్టం చేశారు. అసలేం జరిగిందంటే..
Adani Port Protests: అదానీ గ్రూప్స్ అభివృద్ధి చేస్తున్న విజిన్‌జమ్ పోర్టుకు కన్‍స్టక్షన్ మెటీరియల్ వెళుతుండగా.. ఆందోళనకారులు శనివారం అడ్డుకున్నారు. నిర్మాణాలు జరుగుతున్న స్థలానికి వెళ్లకుండా అడ్డగించారు. దీంతో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‍కు తరలించారు. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలంటూ విజిన్‍జమ్ స్టేషన్‍ను వేలాది మంది ముట్టడించారు. అప్పుడే ఆందోళనకారులు.. పోలీసు స్టేషన్‍పై దాడికి పాల్పడ్డారు. వ్యతిరేకత ఎందుకు! Adani Port Protests: విజిన్‍జమ్ పోర్టు పనులను అదానీ గ్రూప్ మూడు నెలలుగా ఆపేసింది. ఆందోళనలు తీవ్రంగా జరుగుతుండటంతో కొంతకాలం నిర్మాణాన్ని నిలిపివేసింది. అయితే కోర్టు ఆదేశాల తర్వాత ఇటీవల పనులను మళ్లీ మొదలుపెట్టింది. అయితే, మత్స్యకారులు ఈ పోర్టుకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు. క్యాథలిక్ మతగురువులు కూడా పాల్గొంటున్నారు. పోర్టు అభివృద్ధి వల్ల సముద్ర తీరం కోతకు గురవుతుందని, తాము జీవనోపాధి కోల్పోతామని ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ పోర్టు అభివృద్ధిని మత్స్యకారులు వ్యతిరేకిస్తున్నారు.