National

ఢిల్లీలో నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాసరావు అరెస్ట్

ఇటీవల ఢిల్లీలో నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాసరావు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ శ్రీనివాసరావు కేసులో భాగంగానే తాజాగా తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను తాజాగా సీబీఐ అధికారులు ఎనిమిది గంటల పాటు విచారించిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయానికి మంత్రి గంగుల అలాగే వద్దిరాజు రవిచంద్ర నేడు మధ్యాహ్నం 12 గంటలకు హాజరయ్యారు. నకిలీ సిబిఐ అధికారి నేను శ్రీనివాసరావు తో సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో ఆరా తీశారు సీబీఐ అధికారులు. అదేవిధంగా అతనితో ఏ ఏ అంశాలపై చర్చలు జరిపిన విషయాల గురించి కూడా ప్రశ్నించారు. 8 గంటల పాటు విచారణ జరిగిన అనంతరం బయటకు వచ్చిన మంత్రి గంగుల, ఎంపీ వద్దిరాజు సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. ఇది కాకుండా రెండవసారి మళ్లీ విచారణకు రావాలన్న విషయాన్ని సీబీఐ తమకు చెప్పలేదని వారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. మేము చెప్పిన అంశాలను వాళ్ళు రికార్డ్ చేసుకున్నారు.

సీబీఐ అధికారుల దగ్గర ఉన్న సమాచారాన్ని మేము ఇచ్చిన సమాచారాన్ని సరిపోల్చుకున్నారు. అలాగే ఈ కేసులో ప్రధాన నిందితుడు అయినా శ్రీనివాసరావుని కూడా మా కళ్ళ ఎదుట ఉంచి కొన్ని ప్రశ్నలు అడిగారు. ఇదే చివరి విచారణ మళ్ళీ విచారణ అవసరం లేదని కూడా తెలిపారు. మేము ఇచ్చిన సమాధానాలతో సిబిఐ అధికారులు సంతృప్తి చెందారు. మాతో శ్రీనివాసరావు ఎటువంటి లావాదేవీలు జరపలేదని శ్రీనివాస్ కూడా అంగీకరించారు. ఏ విధంగా మేము ఇచ్చిన స్టేట్ మెంట్ పై సంతకాలు కూడా తీసుకున్నారు అని చెప్పుకొచ్చారు గంగుల కమలాకర్. అనంతరం వద్దిరాజు మాట్లాడుతూ.. మేము సీబీఐ అధికారులకు అన్ని విధాల సహకరించాము. నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాసులు మాకు ఎదురుగా కూర్చోబెట్టి విచారణ చేశారు. మాపై కొందరు కావాలని ఆరోపణలు చేయించారు. శ్రీనివాసరావును కాపు సమ్మేళనంలో మాత్రమే కలిసాము అని చెప్పుకొచ్చారు రవిచంద్ర.