National

మనీలాండరింగ్ కేసులో భాగంగా సౌమ్య చౌరాసియా అనే ఐఏఎస్ ఆఫీసర్‌ను అరెస్ట్

తాజాగా ఈడీ అధికారులు మనీలాండరింగ్ కేసులో భాగంగా సౌమ్య చౌరాసియా అనే ఐఏఎస్ ఆఫీసర్‌ను అరెస్ట్ చేసింది. సౌమ్య ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ వద్ద డిప్యూటీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తోంది. ఈడీ ఆమెను అరెస్టు చేసి అనంతరం కోర్టులో హాజరుపరిచింది. ఈ నేపథ్యంలోనే ఆమెను పదిరోజుల పాటు రిమాండ్‌కు తరలించాలని కోరింది. కాగా 2020 ఫిబ్రవరిలో సీఎం భూపేష్ బఘేల్ డిప్యూటీ సెక్రటరీ సౌమ్య చౌరాసియా ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. ముఖ్యమంత్రి బఘేల్ దీనిని రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణించారు. రాజకీయంగా కక్ష తీర్చుకునేందుకే కేంద్రం ఈడీ, ఐటీలను రాష్ట్రాలపై ప్రయోగిస్తుందని సీఎం భూపేశ్ భగేల్ పేర్కొన్నారు.

అంతేకాకుండా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇకపోతే సౌమ్య చౌరాసియాను అరెస్టు చేసినట్లు ఈడీ కోర్టుకు తెలిపింది. రిమాండ్ కోరుతూ ఆమె నిరంతరం సమాచారం కోసం కాల్ చేస్తున్నారని డిఫెన్స్ న్యాయవాది తెలిపారు. ఇప్పుడు ఎవరిని రిమాండ్‌లో తీసుకోవాలనుకుంటున్నారో ఆరా తీయడమే మిగిలింది. అయితే ప్రస్తుతం ఇదే విషయం పై కోర్టులో విచారణ జరుగుతోంది. సౌమ్య చౌరాసియాను అరెస్టు చేసిన తర్వాత ఈడీ బృందం ఆమెను విచారణ కోసం ఆసుపత్రికి తీసుకెళ్లిందని, ఆ తర్వాత ఆమెను కోర్టులో హాజరుపరించిందట. కాగా గత ఏడాది జూన్‌లో ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌ పూర్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు నిర్వహించగా ఆ సమయంలో దాదాపు రూ. 100 కోట్లకు పైగా హవాలా రాకెట్‌ను గుర్తించారు అధికారులు. అయితే పెద్దఎత్తున సొమ్ము హవాలా మార్గంలో చేతులు మారిందని పేర్కొన్నారు.