CINEMA

సమంత మీద పగ సాదించడానికే ఆ పని చేస్తున్న naga chaitanya..!!

సమంత-నాగచైతన్య ఎంతో గాఢంగా ప్రేమించుకుని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకున్నా వాళ్లని ఒప్పించి మరీ అంగరంగ వైభవంగా పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లయ్యాక నాలుగు సంవత్సరాల పాటు ఎంతో అన్యోన్యంగా చాలా ప్రేమగా ఉండేవారు. అంతేకాదు చాలామంది సినీ సెలబ్రిటీలకు ఈ జంట అంటే కొంచెం అసూయ కూడా ఉండేది. అలా ఉండేది వీరి జంట. ఇక అలాంటి ఈ దంపతులకు ఎవరి దిష్టి తగిలిందో ఏమో కానీ అనూహ్యంగా విడాకులు తీసుకుంటున్నామంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇక ఈ విషయం తెలియగానే ఒక్కసారిగా కుటుంబ సభ్యులతో పాటు ఇండస్ట్రీ జనాలు అలాగే అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు. ఇంత మంచి జంట విడాకులు తీసుకోవడానికి ఎందుకు రెడీ అయ్యారు అంటూ చాలామంది భాధ పడ్డారు. ఇక విడాకులు తీసుకొని సంవత్సరం గడిచినా కూడా వీళ్లు విడాకులు ఎందుకు తీసుకున్నారో ఇప్పటికీ ఏ ఒక్కరికి తెలియదు. ఈ విషయంలో ఒకరిది తప్పంటే మరొకరిది తప్పంటూ ఇప్పటికే ఎన్నో వార్తలు వినిపించాయి. అయితే సమంత నాగచైతన్య విడిపోయాక నాగచైతన్య కు ఒక్క సినిమా కూడా మంచి పేరు తెచ్చి పెట్టలేదు.

బంగార్రాజు (Bangarraju) సినిమా హిట్ అయినప్పటికీ ఆ క్రెడిట్ మొత్తం నాగార్జున (Nagarjuna) కే దక్కింది. ఇక ఈ మధ్యకాలంలో ఈయన నటించిన థాంక్యూ (Thank You) , లాల్ సింగ్ చద్దా రెండు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఈయన ధూత (Dootha) అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వెబ్ సిరీస్ ఇప్పటికే షూటింగ్ పూర్తి అయినప్పటికీ రిలీజ్ కి నోచుకోవడం లేదు. ఇక ఈ వెబ్ సిరీస్ లో నాగచైతన్య ఓ జర్నలిస్టు పాత్రలో నటించారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి.అయితే నాగచైతన్య ఇలాంటి పాత్రల్లో ఇప్పటివరకు ఏ ఒక్క సినిమాలో కనిపించలేదు. దాంతో ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. ఇక ఈ విషయం పక్కన పెడితే..నాగచైతన్య వెబ్ సిరీస్ చేయడానికి ప్రధాన కారణం సమంత (Samantha) నే అని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే సమంత ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక సమంత లాగే నాగచైతన్య (Naga Chaithanya) కూడా వెబ్ సిరీస్లలో నటించి సమంత కంటే మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆయన భావిస్తున్నారట. ఇక ఏ విషయంలోనైనా సమంత కంటే తనదే పై చేయి ఉండాలనే ఉద్దేశంతో నాగచైతన్య ఈ వెబ్ సిరీస్ లో నటించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వెబ్ సిరీస్ ద్వారా నాగచైతన్య సమంత మీద పై చేయి సాధిస్తారో లేదో వేచి చూడాలి.