Technology

యూ ట్యూబర్ పెళ్లికి 4 కోట్ల చదివింపులు.!

యూ ట్యూబ్.. ఈ పేరుకు పరిచయమే అక్కర్లేదు. ఏడాది పిల్లాడి నుంచి, ఏళ్లు గడిచిపోయిన ముసలాడి వరకూ యూ ట్యూబ్ సుపరిచితమే. ఎవరికి నచ్చిన విధంగా వారు, యూ ట్యూబ్ వేదికగా ఎంటర్‌టైన్‌మెంట్ ఎంజాయ్ చేస్తుంటారు. అలాగే యూట్యూబ్‌ని సక్రమంగా వినియోగించే వాళ్లు దాన్నుంచి బోలెడంత నాలెడ్జ్ కూడా గెయిన్ చేస్తున్నారు. ఎన్నో తెలియని విషయాలు నేర్చుకుంటున్నారు. అలాగే, ఎంతో మంది నిరుద్యోగులు వినూత్నంగా ఆలోచిస్తూ, తమదైన శైలిలో ఆదాయం కూడా పొందుతున్నారు. అక్షరాలా కోట్లే సుమా.! అలాగే ఓ యూ ట్యూబర్ కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

ఆయన మరెవరో కాదు. ‘శ్రీ’. సోషల్ మీడియా యూజర్లకు మాత్రమే ఈ పేరు సుపరిచితం కావచ్చు. యూ ట్యూబ్‌లో మనోడికి 25 వేలకు పైగా సబ్‌స్క్రైబర్లున్నారు. ఈయన ఇటీవలే వివాహం చేసుకున్నారు. తన పెళ్లి వీడియోని యూ ట్యూబ్‌లో పోస్ట్ చేసి, తమ జంటని ఆశీర్వదించమని కోరాడు. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఆశీస్సులతో పాటూ, సబ్‌స్ర్కైబర్లు చదివింపులు కూడా పంపించారు. వావ్.! అదిరిందయ్యా శ్రీ.. అనేస్తున్నారా. ఇంకా అయిపోలేదు ఆగండాగండి. ఇంతకీ ఇలా వచ్చిన చదివింపుల సంఖ్య ఎంతో తెలుసా.? అక్షరాలా నాలుగు కోట్ల పై చిలుకే. అవాక్కయ్యారా.! ఆ విషయం స్వయంగా ఈ యూ ట్యూబరే తన ఛానెల్ ద్వారా తెలిపడంతో, ఈ న్యూస్ ఇప్పుడు వైరల్‌గా మారింది.