తెలుగు సినిమా ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్న మోహన్ బాబు ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి తన అద్భుతమైన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. అలాంటి మోహన్ బాబు నట వారసులుగా ఇండస్ట్రీలోకి మంచు విష్ణు,మంచు మనోజ్ ఇద్దరు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఇక వీరు తండ్రి లాగా స్టార్డం తెచ్చుకోవడానికి ఎన్నో తంటాలు పడుతున్నప్పటికీ తండ్రిలా స్టార్ డం రావడం లేదు. ఇక ఈ విషయం పక్కన పెడితే..మంచు మనోజ్ (Manchu Manoj Marraige) గత కొన్ని రోజులుగా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. దానికి కారణం మనోజ్ రెండో పెళ్లి చేసుకోవడమే అంటూ ఇప్పటికే ఎన్నో వార్తలు వినిపించాయి. మంచు మనోజ్ (Manchu Manoj) మొదట ఓ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ తర్వాత కొన్ని రోజులకు విడాకులు తీసుకున్నాడు. భూమా మౌనిక అనే అమ్మాయితో మంచు మనోజ్ రిలేషన్ లో ఉన్నాడంటూ గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. ఇక దీనికి అనుగుణంగానే వీరిద్దరూ వినాయక చవితి పండుగ సందర్భంగా గణేష్ మండపానికి వెళ్ళినప్పుడు భూమా మౌనిక (Bhuma Mounika) తో కలిసి వెళ్లడం అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.
దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఎఫైర్ ఉందని త్వరలోనే వీళ్ళు పెళ్లి కూడా చేసుకుంటారంటూ వార్తలు వినిపించాయి. అయితే మంచు మనోజ్ (Manchu Manoj Marraige) త్వరలోనే తన పెళ్లి అంటూ ఒక హింట్ ఇచ్చారట.ఇంతకీ ఆయన పెళ్లి ఎప్పుడో ఇప్పుడు తెలుసుకుందాం. మంచు మనోజ్ కడపలో ఫేమస్ అయినా దర్గా కు వెళ్లారు. ఇక అక్కడ వాళ్లతో మాట్లాడుతూ.. నేను చాలా రోజుల నుండి ఈ దర్గాకి రావాలనుకుంటున్నాను. అయితే ఇప్పటికే నా కుటుంబ సభ్యులు,స్నేహితులు అందరూ ఈ దర్గాకి వచ్చి దర్శించుకున్నారు.కానీ నేను మాత్రం వారితో రాలేదు. నాకు ఈ దర్గాకి రావడానికి చాలా రోజుల టైం పట్టింది.అలాగే నేను త్వరలోనే కొత్త సినిమాతో మీ ముందుకు వస్తాను. అతి త్వరలోనే కొత్త జీవితాన్ని కూడా ప్రారంభించబోతున్నాను అంటూ అక్కడ వాళ్లతో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన మాటలను బట్టి చూస్తే ఆయన త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ పరోక్షంగా ఓ హింట్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మరి వీరి పెళ్లి డేట్ ఎప్పుడో త్వరలోనే ప్రకటిస్తారు కావచ్చు.