Jobs

IIIT నాగపూర్ బ్రాంచ్ లో 15 ఫ్యాకల్టీ పోస్ట్ ల భర్తీ

ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(Indian Institute of Information Technology, IIIT) నాగపూర్ బ్రాంచ్ లో అధ్యాపక పోస్ట్ లను భర్తీ చేయనున్నారు. మొత్తం 15 ఫ్యాకల్టీ పోస్ట్ లను భర్తీ చేయాలని నిర్ణయించారు. How to apply IIIT Teaching Recruitment: అప్లై చేయడం ఎలా? ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(Indian Institute of Information Technology, IIIT) నాగపూర్ బ్రాంచ్ లో 15 ఫ్యాకల్టీ పోస్ట్ ల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. సంబంధిత సబ్జెక్టులో పీహెచ్ డీ చేసిన వారు కానీ, టీచింగ్ లో నిర్ధారిత కాలం అనుభవం ఉన్నవారు కానీ ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవడానికి అర్హులు. పూర్తి వివరాలకు, అలాగే ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ట్రిపుల్ ఐటీ నాగపూర్ బ్రాంచ్ అధికారిక వెబ్ సైట్ iiitn.ac.in ను సందర్శించాలి. Last date for IIIT Teaching Recruitment: లాస్ట్ డేట్ ఎప్పుడు? ట్రిపుల్ ఐటీ(Indian Institute of Information Technology, IIIT) నాగపూర్ బ్రాంచ్ లో ఫ్యాకల్టీ పొజిషన్లకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీలు డిసెంబర్ 30, అలాగే, జనవరి 06, 2023. అంటే, డిసెంబర్ 30 లోపు ఆన్ లైన్ లో అప్లికేషన్ ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాేగ, జనవరి 6 లోపు ఆన్ లైన్ అప్లికేషన్ ఫామ్ హార్డ్ కాపీని పంపించాల్సి ఉంటుంది.

Qualifications for IIIT Teaching Recruitment: అర్హత ఏంటి? ఈ ఫ్యాకల్టీ పోస్ట్ లకు అప్లై చేసుకోవాడానికి సంబంధిత సబ్జెక్టులో పీహెచ్ డీ() సాధించి, మూడేళ్లు పూర్తై ఉండాలి. లేదా ఏదైనా ప్రముఖ విద్యాసంస్థ లో టీచింగ్ లేదా పరిశోధన విభాగంలో కానీ, ఏదైనా పరిశోధక సంస్థలో పరిశోధన విభాగంలో కానీ ఆరేళ్లు పని చేసిన అనుభవం ఉండాలి. పూర్తిగా నింపిన అప్లికేషన్ ఫామ్ కు అవసరమైన సర్టిఫికెట్ల అటెస్టెడ్ కాపీలను జత చేసి రిజిస్టర్ పోస్ట్ లో కానీ, స్పీడ్ పోస్ట్ లో కానీ, కొరియర్ ద్వారా కానీ, స్వయంగా కానీ The Director, Indian Institute of Information Technology, Nagpur S.No. 140,141/1 Behind Br. Sheshrao Wankhade Shetkari Sahkari Soot Girni, Village – Waranga, PO – Dongargaon (Butibori), District – Nagpur Maharashtra Pin Code – 441108. అడ్రస్ కు గడువు తేదీ లోగా పంపించాలి. అప్లికేషన్ ఫీజు రూ. 1180. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు రూ. 590.